భారత దేశంలో ఇప్పుడు కబాలి ఫీవర్ నడుస్తుంది. అయితే రేపు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే..అయితే యూఎస్ లో మాత్రం  ఈ రోజు ఉదయం 11గం.లకు  స్పెషల్ స్క్రీనింగ్ జరుపుకుంది.  ఇక స్పెషల్ షోకి రజినీకాంత్ తన కుటుంబ సభ్యులతో హాజరు కాగా.. ప్రత్యేక ఆహ్వనితులు, సన్నిహితుల సమక్షంలో తలైవా కబాలి చిత్రాన్ని వీక్షించారు.   400 థియేటర్లలో కబాలి మూవీని విడుదల చేయనుండగా యూఎస్‌లో తొలిసారి అన్ని థియేటర్లలో విడుదల కానున్న మూవీగా కబాలి రికార్డు సాధించింది. అందరూ ఊహించినట్లుగానే ఈ చిత్రంలో రజినీ కాంత్ కనిపించిన ప్రతి సన్నివేశం ఉత్కంఠ భరితంగా ఉన్నట్లు అభిమానుల తమ ఈలలు, గోలలతో థియేటర్లని హోరెత్తిస్తారని కొందరు చెబుతున్నారు.  అంతే కాదు  పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా కబాలి ఉందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు.

ఈ స్పెషల్ షోతో అంచనాలు మరింతగా పెంచేసింది. అయితే ఇప్పటి వరకు రజినీకాంత్ ఇంత స్టైలిష్ లుకింగ్ లో కనిపించడం ఇదే మొదటి సారి అని ఒకప్పుడు యంగ్ ఏజ్ లో రజినీకాంత్ ఎలా ఉన్నాడో అచ్చూ అలాగే కనిపించి ప్రస్తుతం ఆయన ఉన్న ఏజ్ కి తగ్గట్టు నటించడం అద్భుతమైన అనుభవం అని అభిమానులు అంటున్నారు.  అయితే కబాలి చిత్రానికి సంబంధించి 2.01 నిమిషాల వీడియో బయటకు లీక్ అయినా అభిమానులు మాత్రం థియేటర్లలోనే సినిమా చూసి ఆనందిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్.

కబాలి స్క్రీనింగ్ కోసం పలు మల్టీప్లెక్స్‌లు స్పెషల్ షోస్ వేస్తున్నాయి. ఎన్నడు లేని విధంగా పలు థియేటర్లలో ఒకే రోజు 120 షోస్ తో ఈ చిత్రం ప్రదర్శించబడనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలు సెలవులు ప్రకటించగా , టిక్కెట్స్ కోసం అభిమానులు థియేటర్ల దగ్గర బారులు తీరారు. అమెరికాలో జరిగిన ప్రీమియర్ షోకి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు తెలుస్తోంది.  అంతే కాదు దాదాపు 5000 థియేటర్లలో కబాలి చిత్రం రేపు విడుదల కానుంది.   ఇండియాలో కబాలి చిత్రాన్ని నాలుగు భాషలలో విడుదల చేస్తున్నారు.

ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: