తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే భారత దేశంలోనే కాకుండా సింగపూర్, మలేషియా,జపాన్,అమెరికా లాంటి దేశాల్లో అభిమానులు ఉన్నారు.  ఇక బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించిన రజినీకాంత్ అంటే భారత దేశంలో తెలియని అభిమానులు ఉండరు. ఇక తమిళ తంబీలకు ఆయన ఓ దైవంలా భావిస్తారు. సినిమా రిలీజ్ కి ముందే థియేటర్ల వద్ద హంగామా సృష్టిస్తారు. తాజాగా ఈ చిత్రం అమెరికా, యూకే లో విడుదల అయ్యింది. అయితే ఈ చిత్రం యొక్క టాక్ ని రివ్యూను అందించారు యూకే సెన్సార్ బోర్డ్ మెంబర్, సిని విశ్లేషకుడు సంధు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే..తమిళనాడు నుంచి కొంతమంది మలేషియా వెళ్తారు. అయితే అక్కడ బానిసలుగా చూస్తున అక్కడి వారిపై తిరగబడతారు వారికి నాయకుడిగా నిలుస్తాడు కబాలి.

ఒక  సాధారణ వ్యక్తి మలేసియా ‘మాఫియా డాన్‌’గా మారిన కథ ‘కబాలి’. అయితే ఈ చిత్రం ఒకప్పుడు కమల్ హాసన్ నటించిన నాయకుడి స్టైల్లోనే ఉన్నట్లు కనిపిస్తుంది.  అయితే కబాలి చిత్రం ఎక్కువ శాతం మలేషియాలో చిత్రీకరించడం వల్ల అక్కడ వారే ఎక్కువ కనిపిస్తుంటారట. అంతే కాదు చాలా మంది విలన్లు కూడ అక్కడివారే. . రంజిత్ కుమార్ దర్శకత్వం చాలా అద్భుతంగా ఉందని అన్నారు. ఈ చిత్రం లోని పాటలు  సూపర్ గా ఉన్నాయన్నారు.  ఎడిటింగ్, కథ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది.. భారీ యాక్షన్ స్టంట్స్ సీక్వెన్సెస్, చిత్రం లో రజనీకాంత్ ఎంట్రీ కి విసిల్స్ వేస్తారని, డైలాగ్స్ కు చప్పట్లు కొడతారని ఆయన తెలిపారు. మరోవైపు అమెరికాలో కూడా సినిమా పట్ల పాజిటీవ్ టాక్ వచ్చిందట..ఈ చిత్రం చూస్తున్నంత వరకు అందరూ మంత్రముగ్దులయ్యారట.

రజినీకాంత్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి అందరి షభాష్ అనిపించాడట. ఈ చిత్రంలో మొత్తానికి రజినీ వన్ మాన్ షో చూపించాడట. కొన్ని కొన్ని సీన్లు వస్తున్నంత సేపు విజల్స్, చప్పట్లతో థియేటర్ మారుమోగిపోయిందట.  యూకే సెన్సార్ బోర్డ్ మెంబర్, సిని విశ్లేషకుడు సంధు ఈ చిత్రానికి ఐదుకు నాలుగు రేటింగ్ ఇచ్చారు. అలాగే ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఈ రివ్యూను పోస్ట్ చేసారు. గతంలో ఈయన  సర్దార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అంటూ చెప్పారు. కానీ ఈ రెండు సినిమాలు భారీ డిజాస్టర్ అయ్యాయి..కానీ సరైనోడు మాత్రం కరెక్టుగా వచ్చింది. ఈ లెక్కన ‘కబాలి’ విషయంలో ఏమవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: