బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకునేకి మీడియా చేస్తున్న ఓవరాక్షన్ చూసి చిర్రెత్తుకొచ్చింది. అందుకే ముంబై మీడియా మీద అమ్మడు రుసరుసలాడుతుంది. ఇంతకీ బీ టౌన్ హాట్ బ్యూటీ దీపికా ఎందుకు కోప్పడింది అంటే తను త్వరలో తల్లి కాబోతుందంటూ ప్రచారం చేస్తున్న మీడియాపై దీపికా ఫైర్ అయ్యింది. దీపికా గర్భవతి కారణాలెవరు అంటూ మీడియా చేస్తున్న రచ్చ చూసి ఆమె షాక్ అయ్యింది.


అయితే బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణ్ వీర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న దీపికా అటు తన ఫ్యామిలీని రణ్ వీర్ ఫ్యామిలీని సీక్రెట్ మీటింగ్ ఏర్పాటుచేసి ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారని కథానాలొస్తున్న ఈ టైంలో దీపికా ప్రస్తుతం గర్భవతి అంటూ హాట్ న్యూస్ ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక ఈ న్యూస్ ను బ్రేక్ చేసేందుకు దీపికా అసలు పెళ్లి కాకుండా గర్భవతి ఎలా అవుతారంటూ ఫైర్ అవుతుంది.


మీడియా తన ప్రేమ విషయంలో చేస్తున్న ఓవరాక్షన్ ను భరించలేకపోతున్న దీపికా త్వరలోనే ఈ టాపిక్ కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాల్లో ఉందట. ఇంతకుముందు రెండు మూడు సార్లు దీపికా, రణ్ వీర్ల పెళ్లి డేట్ ఎనౌన్స్ చేయడమే అన్న పరిస్థితులు కనబడ్డా ఇప్పుడు కెరియర్ బిజీలో పడి ఇద్దరు కలవడమే తగ్గించారట.


ఇక ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలను కూడా చేస్తున్న దీపికా ఇక అక్కడ క్రేజ్ సంపాదిస్తే పెళ్లి కూడా ఇప్పుడప్పుడే చేసుకునే అవకాశం లేదు. మరి ఇన్ని ఆలోచనలున్న దీపికా గర్భవతని న్యూస్ వచ్చేసరికి షాక్ అయిన ముద్దుగుమ్మ ఛీ అనుకుంటూ సమాధానం ఇస్తుంది. మరి అలా అనుకునే అవకాశం ఇచ్చిన అమ్మడు ఇప్పుడు ఛీ కొట్టడం దేనికో ఆమెకే తెలియాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: