ఈరోజు విడుదల అవుతున్న ‘కబాలి’ టాక్ గురించి మన ఇరు రాష్ట్రాలలోని రజినీకాంత్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుడు కూడ చాల ఆశక్తిగా ఎదురు చూస్తూ ఉంటే ‘కబాలి’ సినిమాలో బాలయ్య ప్రస్తావన ఉంది అని వార్తలు రావడం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. అయితే ఈ బాలయ్య నందమూరి సింహం బాలకృష్ణ కాడు. ‘కబాలి’లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక తెలుగు పుస్తకం ఇంగ్లీష్ వెర్షన్ చదువుతూ కనిపిస్తాడు. 

కరీంనగర్ కు చెందిన వైబీ సత్యనారాయణ అనే రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాసిన పుస్తకం ‘మా నాయిన బాలయ్య’ ఇంగ్లీష్ అనువాదం ‘మై ఫాదర్ బాలయ్య’ అనే పుస్తకాన్ని ‘కబాలి’ పాత్రలోని రజినీకాంత్  చదివే సీన్ ఈ సినిమాలో చాల కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ పుస్తకంలోని కథ సమాజంలోని అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థితికి చేరిన తెలంగాణ దళిత మాదిగ కుటుంబం చేసిన పోరాటాన్ని నేపథ్యంగా సాగిన కథ.  తెలుగు దళిత సాహిత్యంలో ఈ పుస్తకానికి చాల గొప్ప పేరు వచ్చింది. 

ఈ పుస్తక రచయిత తన కుటుంబ చరిత్రని ఆయన ఇందులో చెప్పుకుంటూ వచ్చాడు. ముత్తాత నర్సయ్య దగ్గర్నుంచి మొదలుపెట్టి తన తండ్రి యెలుకటి బాలయ్యతో పాటు మొత్తం నాలుగు తరాల చరిత్రను ఈ పుస్తకంలో వివరించాడు రచయిత. రజినీకాంత్ ఈ పుస్తకాన్ని చదువుతూ కనిపించడం వెనుక దర్శకుడు రంజిత్ పాత్ర కీలకం అని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. 

సినిమాలలో కుల ప్రస్తావన తీసుకు రావడం సరైన పద్ధతి కాకపోయినా దర్శకుడు రంజిత్  ఒక పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన నేపధ్యంలో అతడి గత రెండు సినిమాలలోను కూడ అంతర్లీనంగా దళిత కుటుంబాల సమస్యల ప్రస్తావన ఉంటుంది. దళిత సాహిత్యం మీద ఎంతో పట్టు ఉన్న రంజిత్ కమ్యూనిజం మీద అంబేద్కరిజం మంచి అవగాహన ఉంది అని అంటారు.  ‘కబాలి’ షూటింగ్ సమయంలో ఈ పుస్తకం గొప్పతనం గురించి తెలుసుకున్న రజినీకాంత్ ఈ సినిమాలోని ఒక కీలక సన్నివేశంలో తాను ఈ పుస్తకం చదువుతున్నట్లుగా ఒక సీన్ క్రియేట్ చేయించాడట రజినీకాంత్. ఇప్పుడు ఈ న్యూస్ బయటకు రావడంతో ‘కబాలి’ లో బాలయ్య ప్రస్తావన హాట్ టాపిక్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: