సూపర్ స్టార్  రజనీకాంత్  ‘కబాలి’ మ్యానియాతో  కోలీవుడ్ టాలీవుడ్ లు షేక్ అవుతూ ఉంటే ‘బాహుబలి’ కి కూడా ఈరోజు కీలకమైన రోజుగా మారింది. రాజమౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి’ నేడు చైనాలో అత్యంత భారీ స్థాయిలో 5 వేల ధియేటర్లలో విడుదల అవుతోంది. కేవలం ఒక్క చైనా నుండే 100 కోట్ల కలక్షన్స్ ను రాబట్టాలని రాజమౌళి భారీ ప్లాన్ రచించాడు. 

ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ‘కబాలి’ భారీ స్థాయిలో విడుదల అవుతూ భారీ కలక్షన్స్ పై కన్ను వేస్తే తాను కూడ ఏమి తక్కువ కాదు అంటూ ఈరోజు నుంచి చైనాలో ‘బాహుబలి’ హంగామా జరగడం యాదృచ్చికం అనుకోవాలి. ఒక వైపు కోలీవుడ్ మీడియా ‘కబాలి’ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుంది అని ఊహాగానాలు చేస్తూ ఉంటే రాజమౌళి హవా చైనాలోకి ప్రవేశిస్తోంది. 

ఈరోజు చైనాలో ‘బాహుబలి’ విడుదల కావడం తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోంది అని అంటూ ప్రభాస్ నిన్న సాయంత్రం ఈ విషయమై తన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ మీడియాకు ఒక స్టేట్ మెంట్ విడుదల చేసాడు. చైనాలో ‘బాహుబలి’ అనుకున్న విజయాన్ని సాధించ గలిగితే ‘బాహుబలి 2’ కు ప్రపంచ వ్యాప్తంగా మరింత క్రేజ్ ఏర్పడుతుంది. 

రజినీకాంత్ క్రేజ్ ఎంత ఉన్నా ‘కబాలి’ విజయం పైన మాత్రమే రజినీ ప్రస్తుతం నటిస్తున్న ‘రోబో 2’ మార్కెట్ ఆధార పడి ఉంది. అదేవిధంగా ‘బాహుబలి’ చైనాలో ఘన విజయం సాధించినప్పుడు మాత్రమే ‘బాహుబలి 2’ కు ప్రపంచ వ్యాప్తంగా మరింత క్రేజ్ ఏర్పడుతుంది. దీనితో ఎలా చూసుకున్నా ఈరోజు ‘కబాలి’ కే కాదు ‘బాహుబలి’ కి కూడ చాల కీలకమైన రోజు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: