ఎన్నో అంచనాలతో విడుదల అయిన ‘కబాలి’ ఈ రోజు తెల్లవాఝామున చెన్నైలో స్పెషల్ షోలన పూర్తి చేసుకోవడంతో ‘కబాలి’ చెన్నై టాక్  బయటకు వస్తోంది. ఈ సినిమా ఇప్పటకే ఓవర్ సీస్ లో తన మొదటిరోజు ప్రీమియర్ షోల ద్వారా అప్పుడే ఒక మిలియన్ డాలర్స్ వసూలు చేసింది అనే వార్తలు రావడంతో జోష్ లో రజినీకాంత్ అభిమానులు ఉన్నారు. 

ఈ సినిమాకు సంబంధించి చెన్నై టాక్ ప్రకారం  ఈ సినిమాను చూసి రజనీకాంత్ అభిమానులు జోష్ లోకి వెళ్ళి పోతూ ఉంటే  సామాన్య ప్రేక్షకులు మాత్రం  ఈ సినిమా పై పూర్తి సంతృప్తి వ్యక్త పరచక పోవడంతో ఈ సినిమాకు డివైడ్ టాక్ గట్టిగానే మొదలైంది అన్న వార్తలు వస్తున్నాయి.  బయట వినపడుతున్న చెన్నై టాక్  లీకుల ప్రకారం ఈ సినిమా ఫస్టాఫ్  చాలా ఎమోషనల్ గా నడిచే స్క్రీన్ ప్లేతో  నడుస్తూ ఊహించని ట్విస్టులు ఇచ్చి ఇంటర్వెల్ వరకు నడిచిందని తెలుస్తోంది.  

అయితే సెకండాఫ్ నెరేషన్ స్లోగా అనిపించడం సాధారణ ప్రేఖకులకు కొంత అసహనం కలిగిస్తుంది అని అంటూ న్నారు. అయితే ఓల్డేజ్ గెటప్ లో రజినీకాంత్ చేసే విన్యాసాలు చూసి మాస్ ఫ్యాన్స్ పండగ చేసేసుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి.  ముఖ్యంగా తమిళ అభిమానులకు అయితే తమిళుల గురించి చెప్పే రజని కాంత్  డైలాగ్ కు థియేటర్స్ అదిరి పోతున్నాయని టాక్. 

రజినీ మూమెంట్స్  చూస్తూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నా నెరేషన్ పరంగా ఈ సినిమా కొందరికి నచ్చడంలేదని తెలుస్తోంది. రజినీ స్టైల్ పంచ్ లు తక్కువగా ఉండటం వలన కూడా మైనస్ పాయింట్ గా చెపుతున్నారు. రెండున్నర గంటల సినిమా అయినా సెకండాఫ్ స్లోగా ఉండడంతో బాగా పెద్ద మూవీ అనే ఫీలింగ్ ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు కలుగుతోంది అని టాక్. అయితే ఈ చిన్నచిన్న లోపాలు రజినీ సునామి ముందు ఆగవు అని మరికొందరు అంటున్నారు. మరి కొన్ని గంటలలో మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: