సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన కబాలి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోస్ పడటంతో రజిని ఫ్యాన్స్ ఉత్సాహలో ఉన్నారు. అయితే కబాలి సృష్టిస్తున సంచలనాల గురించి ఆలోచిస్తే మాత్రం వామ్మో అనాల్సిందే. భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంతే భారీ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది.


ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా షాక్ ఇచ్చేలా చేస్తున్న కబాలి మొదటి రోజు కలక్షన్స్ మీద అందరి దృష్టి ఉంది. బాలీవుడ్ సినిమాల్లా ఇది కూడా వీలైనంత మొత్తం మొదటి రోజే వసూళు చేయాలని చూస్తుంది. ఎలాగు వీకెండ్ ఉండనే ఉంది. సినిమా కోసం చెన్నై, బెంగుళూరు కంపెనీలుల్ హాలీడే కూడా ఇచ్చాయి. సో మరి కలక్షన్స్ ఎంత వస్తాయన్నది ఇంట్రెస్టింగ్ న్యూస్.


ఇక కబాలి తెలుగులో ఓ కొత్త రికార్డును సృష్టించింది. సాధారణంగా శాటిలైట్ రైట్స్ లో ఏ డబ్బింగ్ సినిమా చేయని డిమాండ్ కబాలి చేస్తుంది. ఏకంగా 8 కోట్ల రూపాయలతో కబాలి శాటిలైట్ రైట్స్ తీసుకున్నదట ఓ ప్రముఖ ఛానెల్. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ రేటంతే అది కేవలం కబాలి రజిని వల్లే అవుతుందని చెప్పొచ్చు.


ఇక బారులు తీరిన ఫ్యాన్స్ హంగామాలో కబాలి రచ్చ చేయడం ఖాయమంటున్నారు. ఇప్పటికే సినిమా ఫ్యాన్స్ ఫీస్ట్ లా ఉంటుందనే టాక్ వచ్చింది. పా.రంజిత్ రజినిని కొత్త స్టైల్ లో చూపించడంలో కేక పెట్టించేశాడట.  కబాలి చేయబోయే రికార్డుల సందడేందో సాయంత్రం కల్లా చూద్దాం మరి.    



మరింత సమాచారం తెలుసుకోండి: