సమ్మర్ రేస్ కు అనుకోని అతిథిలా వచ్చిన ‘బిచ్చగాడు’ టాలీవుడ్ లో ఎటువంటి సంచలనాలు సృస్థించిందో తెలిసిన విషయమే. సమ్మర్ రేస్ కు వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లు సాధించలేని ఘన విజయం ఒక డబ్బింగ్ సినిమా సాధించడం ఇప్పటికీ టాలీవుడ్ దర్శక నిర్మాతలకు అర్ధం కాని పజిల్ లా మారింది. 

తమిళ హిట్ మూవీ ‘పిచ్చైకారన్’ కు తెలుగు డబ్బింగ్ గా ‘బిచ్చగాడు’ విడుదల అయిన తరువాత ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామంటే ఏ హీరో ముందుకు రాలేదు అన్న విషయం నమ్మలేని నిజం. రానాతో పాటు కొందరు హీరోలను ట్రై చేసి విసిగిపోయిన ఈ సినిమా దర్శక నిర్మాతలు విసిగిపోయి చివరికి ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ అమ్మేసారు. ఈ సినిమా అనూహ్యమైన కలెక్షన్లు సాధిస్తూ శతదినోత్సవం దిశగా దూసుకెళ్లిపోతోంది. 

తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా సాధించిన విజయం చూశాక మిగతా భాషల వాళ్లు ‘పిచ్చైకారన్’ రీమేక్ కోసం తహతహలాడిపోతున్నారు. ఈ నేపధ్యంలో రీమేక్ సినిమాలకు బాగా ఫేమస్ అయిన కన్నడ ఇండస్ట్రీలో ఈ సినిమాను ఒక ప్రముఖ నిర్మాత ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి రీమేక్ రైట్స్ తీసేసుకున్నట్లు టాక్. అంతేకాదు ఇప్పుడు కన్నడలో బిచ్చగాడు పాత్ర పోషించడం కోసం టాప్  హీరోలు  తెగపోటీ పడుతున్నారట. 

అయితే ఈరేస్ లో కన్నడ హీరో సుదీప్ ముందు వరసలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ‘పిచ్చైకారన్’ రీమేక్ తన కెరీర్ లో మరో ప్రత్యేకమైన సినిమా అవుతుందని సుదీప్ భావిస్తూ ఈ సినిమాను కొనుక్కున్న కన్నడ నిర్మాత పై ఈ సినిమా ఛాన్స్ కొట్టేయడానికి సుదీప్ ఒత్తిడి  చేస్తున్నట్లు టాక్. ఇక టాలీవుడ్ లో ‘బిచ్చగాడు’ 70 రోజులు దాటినా ఇంకా నిలకడకలెక్షన్లతో నిలబడటం ఎవరికీ అర్ధంకాని ప్రశ్నగా మారి పోయింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: