సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కబాలి ఎక్కడా కూడా ఆగేలా కనపడ్డం లేదు, తన స్పీడుకు ఎవ్వరూ బ్రేక్ వెయ్యలేరు అన్నట్టు కలక్షన్ లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఓపెనింగ్స్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న కబాలి కాస్త నెగెటివ్ టాక్ తో నడుస్తోంది. నారేషన్ విషయం లో డైరెక్టర్ రంజిత్ చేసిన తప్పిదం ఈ సినిమాకి ఒక మైనస్ అంటూ ఊదరగొట్టేస్తున్నారు సోషల్ మీడియా లో. అయితే ఎక్స్ పెక్టేషన్ లతో జనం ఎగబడుతున్నారు కాబట్టి మొదటి రోజు, ప్రీమియర్ లలో ఇలాంటి టాక్ వస్తుంది అనీ కబాలి నెమ్మదిగా పుంజుకునే సినిమా అని అంటున్నారు విశ్లేషకులు.

 

 ఈ విషయం పక్కన పెడితే కబాలి శాటిలైట్ ఇందాకనే పూర్తి అయినట్టు తెలుస్తోంది. అక్షరాలా ఎనిమిది కోట్లు చెల్లించి జెమిని టీవీ ఈ సినిమా హక్కులు కొనుక్కుంది. ఒక డబ్బింగ్ సినిమాకి ఈ రేంజ్ లో సొమ్ము చెల్లించి శాటిలైట్ రైట్స్ కొన్నారు అంటే ఇది చాలా భారీ రికార్డు అని చెప్పచ్చు. రజినీకాంత్ సినిమాలో కబాలి కొత్త సంచలనంగా మారగా ఈ సినిమా ఇప్పుడు సాటిలైట్ విషయం లో కూడా భారీ స్పందన చూపిస్తోంది.

 

 కబాలి ప్రీమియర్ లూ, ఫస్ట్ డే షో లూ జరుగుతున్న నేపధ్యం లో ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న విషయం అయినా కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో పెద్ద వార్తగా చక్కర్లు కొడుతోంది. టాక్ లూ, రివ్యూ లూ అంటూ కబాలి మానియా అంతా స్ప్రెడ్ అవుతోంది. సినిమా టికెట్ ల కోసం బారులు తీరిన క్యూ లు దర్సనం ఇస్తోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5వేల థియేటర్లలో రిలీజ్ అయిన రజినీకాంత్ మూవీ.. రిలీజ్ రోజున వసూళ్లలో చాలా లెక్కలే సరిచేయబోతున్నాడు. వాటితో పోల్చితే ఈ శాటిలైట్ రైట్స్ మేటర్ చాలా చిన్నదే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: