తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఒక్క తమిళనాడులోనే కాకుండా యావత్ భారత దేశంలో ఆయనకు మంచి ఫ్యాన్ ఫోలోయింగ్ ఉంది. అంతే కాదు జపాన్, మలేషియా,అమెరికా,సింగపూర్  లాంటి దేశాలకల్లో కూడా రజినీకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియాలో విడుదైన ప్రతి సినిమా అక్కడ విడుదల కావడం జరుతుగుంది. ఈ నేపథ్యంలో రజినీకాంత్, దర్శకుడు రంజిత్ కాంబినేషన్ లో వచ్చిన కబాలి చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా మానియా అంతా ఇంతా కాదు వారం రోజుల ముందు నుంచి టిక్కెట్ల హడావిడి మొదలైంది. తమిళనాడులో అయితే ఏకంగా మంత్రుల రికమండేషన్ లెటర్లతో మరి ఫ్యాన్స్ థియేటర్ల వద్దకు వెళ్తున్నారు.

తాజాగా రజినీకాంత్ మొదటి ఆట టికెట్ దొరకలేదని ఓ యువకుడు అందరూ చూస్తుండగానే మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మలేషియాలో జరిగింది.  రజనీకాంత్  కబాలి చిత్రం మొట్టమొదటి షో కు తనకు టికెట్లు దొరకలేదన్న మనస్తాపంతో రజనీ అభిమాని ఒకరు సూసైడ్ చేసుకున్నాడు. మలేసియా లోని కేన్ సీసీ ప్రాంతంలో అక్కడి 10 అంతస్తుల భవనం నుంచి కిందికి దూకి ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

వెంటనే గమనించిన పోలీసులు అతన్ని రక్షించాలనుకున్నా అప్పటికే మృతి చెందాడు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మలేసియా లో కబాలి సునామీ విపరీతంగా ఉంది. ఈ చిత్రం తమిళనాడు, మలేషియాలలోనే ఎక్కువ షూటింగ్ జరుపుకుంది. సినిమా కూడా మలేషియా నేపథ్యంలోనే కొనసాగడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: