ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కబాలి’ చిత్రం థియేటర్లోకి రానే వచ్చింది. అయితే ఈ చిత్రం పై చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు.  తమ ఆరాధ్య కథానాయకుడు నటించిన సినిమాను తొలిరోజే చూడాలన్న ఉద్దేశంతో అభిమానులు ధియేటర్లకు పోటెత్తారు. అయితే వాస్తవానికి ఈ చిత్రం నిన్ననే అమెరికా, యూకేలో విడుదలైంది..ఈ చిత్రానికి సంబంధించి ప్రముఖ యూకే సెన్సార్ బోర్డ్ మెంబర్, సిని విశ్లేషకుడు సంధు ఈ చిత్రానికి ఐదుకు నాలుగు రేటింగ్ ఇచ్చారు. రంజిత్ కుమార్ దర్శకత్వం చాలా అద్భుతంగా ఉందని అన్నారు. ఈ చిత్రం లోని పాటలు  సూపర్ గా ఉన్నాయన్నారు.  

ఎడిటింగ్, కథ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది.. భారీ యాక్షన్ స్టంట్స్ సీక్వెన్సెస్, చిత్రం లో రజనీకాంత్ ఎంట్రీ కి విసిల్స్ వేస్తారని, డైలాగ్స్ కు చప్పట్లు కొడతారని ఆయన తెలిపారు. సినిమా చూసినవాళ్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సినిమా చాలా బాగుందని రజనీ అభిమానులు అంటుంటే అంత గొప్పగా ఏంలేదని మామూలు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.  అయితే ఈ చిత్రంపై సమీక్ష రాసేవారు మాత్రం కాస్త జాగ్రత్తగా చాయాలని రజినీ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ సినిమాపై కొంత మంది పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందా...! రజినీకాంత్ సినిమా మొదటి రోజు చూసే ఆనందమే వేరు.

ఇది సంబరాలు చేసుకోవాల్సిన  సమయమని  టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా ట్వీట్ చేశాడు.ఫ్రాన్స్ గ్రాండ్ ఫిక్స్ ధియేటర్ లో 'కబాలి' సినిమా ప్రదర్శన సందర్భంగా రజనీకాంత్ తెరపై కనిపించిన సందడి ఫొటోను ట్విట్టర్ లో పెట్టాడు. ధియేటర్ లో 2800 మంది ఉన్నారని వెల్లడించాడు. రివ్యూలను ఏమాత్రం పట్టించుకోకుండా రజినా కబాలి చిత్రాన్ని ఖచ్చితంగా చూడాలని కొంత మంది అభిమానులు అంటున్నారు. సినిమా నెమ్మదిగా ఉందని, చాలా సన్నివేశాలు విసుగు పుట్టించాయని రాకేశ్ కుమార్ అనే ప్రేక్షకుడు పేర్కొన్నాడు. రజనీకాంత్ తొలిసారిగా కనిపించే సన్నివేశం బాగుందన్నాడు.  మిగతా అంతా కాస్తు సుత్తి కనిపిస్తుందని అన్నారు.

ఇక మరో అభిమాని అయితే 'కబాలి' తీవ్ర నిరాశకు గురిచేసిందని, డబ్బులు తిరిగిచ్చేయాలని మరో ప్రేక్షకుడు వాపోయాడు.  కొంత మంది ఇంత చెత్త సినిమా తీసిన దర్శకుడు పా రంజిత్ కు క్షమించలేమంటూ ఇంకో ప్రేక్షకుడు అసహనం వ్యక్తం చేశాడు. 'కబాలి'ని 'లింగా' సోదరుడిగా పోల్చాడు. ఏది ఏమైనా ఈ సినిమాపై డివైట్ టాక్ వస్తుంది.  కాకపోతే కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: