పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చేస్తున్న సినిమా గురించి అందరు అన్ని విధాలుగా తెలుసుకే ప్రయత్నం చేస్తున్నా సినిమా గురించి ఎటువంటి అప్డేట్స్ రాకపోయే సరికి దాదాపు సినిమా ఆగిపోయిందనే అనుకుంటున్నారు. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో హంగామాగా స్టార్ట్ అయిన ఈ సినిమా నుండి సూర్య అవుట్ అయ్యి డాలి ఎంట్రీ ఇచ్చాడు. అయితే డాలితో కూడా పవన్ సంతృప్తిగా లేడు అన్న మాటలు వినపడ్డాయి. 


ఇక సినిమా గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాస్తుండటంతో నిర్మాత శరత్ మరార్ సినిమా గురించి వివరణ ఇచ్చారు. పవర్ స్టార్ డాలి డైరక్షన్లో సినిమా రెగ్యులర్ షూట్ కు సంబందించిన విషయాలను ఎనౌన్స్ చేశాడు నిర్మాత శరత్ మరార్. ఎప్పటి పరిస్థితుల్లో ఆగష్టులో సినిమా స్టార్ట్ అవుతుందని అన్న మరార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసనే అంటూ కన్ఫాం చేశాడు.


సో ఈ న్యూస్ తో డాలితో పవన్ అన్ సాటిస్ ఫ్యాక్షన్ అన్న వార్త రూమర్ అని తేలింది. ఆకుల శివ రాసిన ఫ్యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కథను తన వర్షన్ రాసుకునేందుకు డాలి కొద్దిపాటి టైం తీసుకున్నాడు. అయితే దీనికే పవన్ సినిమా ఆగిపోయిందని నెగటివ్ ప్రచారం చేశారు మీడియా వాళ్లంతా. 


గోపాల గోపాల తర్వాత పవన్ తో కలిసి చేస్తున్న డాలి సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ వచ్చి అభిమానులను నిరాశ పరచిన పవర్ స్టార్ ఈ సినిమాతో ఫ్యాన్స్ కు మరో ఫీస్ట్ లాంటి సినిమా ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సినిమా ఎలా ఉంటుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: