నిన్న ప్రపంచ వ్యాప్తంగా ఆరువేల ధియేటర్లకు పైగా భారీ హైక్ తో విడుదల కాబడ్డ ‘కబాలి’ డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో రజినీకాంత్ అభిమానులు నిరాశలోకి వెళ్ళిపోయారు. మొదటి రోజు మొదటి షో ప్రారంభం ముందు రజినీ అభిమానులలో కనిపించిన ఉత్సాహం ఈ సినిమా మొదటి షో అయిపోగానే రజినీకాంత్ వీరాభిమానులు కూడ నిరాశ పడిపోయారు. 

దాదాపు 200 కోట్లకు పైగా బిజినెస్ జరిగిన ఈసినిమాను భారీ మొత్తాలకు కొనుక్కున్న కోలీవుడ్ టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా తాము పెట్టుబడి అయినా తిరిగి వస్తుందా అన్న టెన్షన్ లోకి వెళ్ళిపోయారు. అయితే ఇంత నెగిటివ్ వార్తలు ‘కబాలి’ పై హడావిడి చేస్తున్నా ఈసినిమా నిర్మాత కలైపులి థాను మాత్రం మంచి జోష్ లో ఉన్నాడని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.

దీనికి కారణం ఒక టాప్ హీరోతో సినిమాను తీసిన నిర్మాతకు సుమారు 10 లేదా 20 కోట్లు లాభం వస్తూ ఉంటుంది. అయితే ‘కబాలి’ కి జరిగిన భారీ బిజినెస్ తో నిర్మాత కలైపులి థాను కు 50 కోట్ల లాభం వచ్చింది అని కోలీవుడ్ మీడియా షాకింగ్ న్యూస్ ను బయట పెట్టింది.  ఈ నిర్మాత ఈ ఏడాది రెండు భారీ సినిమాలను నిర్మించాడు. అందులో ఒకటి విజయ్ హీరోగా వచ్చిన ‘తెరి’ అయితే రెండవ సినిమా ‘కబాలి’ ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ కాకపోయినా కలైపులి థానుకు 70 కోట్ల లాభం వచ్చింది అంటూ షాకింగ్ న్యూస్ ను బయట పెట్టింది కోలీవుడ్ మీడియా.

ఇక ‘కబాలి’ సినిమాకు సంబంధించి  రజనీ రెమ్యూనిరేషన్ పక్కన పెడితే ఈనిర్మాత చాలా కాస్ట్ కటింగ్ తో తెలివిగా ఈసినిమాను చేసాడని అంటున్నారు. ఈ సినిమా దాదాపు పూర్తిగా అవుట్ డోర్ లో, వీలయినంత నాచురల్ లొకేషన్లలో తీయడంతో ఖర్చు తగ్గి రజినీ క్రేజ్ తో బిజినెస్ భారీగా చేసి కలైపులి థానుకు 50 కోట్ల వరకు మిగిలింది అంటూ కోలీవుడ్ మీడియా బయట పెడుతున్న విషయాలు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: