బాహుబలి’ లోని కాలకేయుడి పాత్రతో ప్రభాకర్ టాలీవుడ్ టాప్ సెలెబ్రెటీగా మారిపోయాడు. అంతేకాదు ‘బాహుబలి’ ఇచ్చిన క్రేజ్ తో ప్రభాకర్ కు అనేక సినిమాలలో అవకాశాలు కూడ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభాకర్ కీలక పాత్ర పోషిస్తూ నూతన నటీనటులతో నిర్మించిన ‘ఆవు-పులి-మధ్యలో ప్రభాస్ పెళ్ళి’ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రభాస్ అభిమానులకు విపరీతమైన కోపం తెప్పిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్నినిజాలో తెలియకపోయినా ఈన్యూస్ హాట్ న్యూస్ గా మారింది.

ఈసినిమాలో హీరో పాత్రను పోషిస్తున్న నూతన నటుడు ప్రభాస్ ‘బాహుబలి’ వార్ సీన్ లో చెప్పిన డైలాగ్ ను అనుసరిస్తూ ‘నాతో వచ్చేది ఎవరూ..చచ్చేది ఎవరూ’ అంటూ ప్రభాస్ ను అనుకరిస్తూ చెప్పిన భారీ డైలాగ్ ప్రభాస్ పై సెటైర్లు వేసినట్లుగా ఉందని ప్రభాస్ అభిమానులు కోపగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ఈ టీజర్ లో కాలకేయ ప్రభాకర్ ‘చూడు ప్రభాస్ మళ్ళీ నాకెప్పుడు కనిపించకు చంపేస్తా’ అంటూ ఆ హీరోని ఉద్దేశించి చెప్పిన డైలాగ్ ప్రభాస్ అభిమానులకు మరింత కోపాన్ని తెప్పిస్తున్నట్లు టాక్.

ఇప్పటి వరకు పవన్ ఇమేజ్ ని వాడుకుంటూ సినిమాలు వచ్చాయి కాని ప్రభాస్ ఇమేజ్ ని వాడుకుంటూ వచ్చిన సినిమాలు లేవు. అయితే ఏకంగా ప్రభాస్ పెళ్లిని టార్గెట్ చేస్తూ ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి’ టైటిల్ తో వస్తున్న ఈసినిమా పేరు వింటే ప్రభాస్ అభిమానులు మండి పోతున్నారు. నెల్లూరు యాస తో బ్లాక్ కామెడీగా నిర్మించ బడ్డ ఈసినిమా ఒక డిఫరెంట్ మూవీ అని ఈసినిమా దర్శక నిర్మాతలు చెపుతున్నారు.

నాగారం సునీల్ అనే యువ దర్శకుడు తీస్తున్న ఈసినిమా ఫస్ట్ లుక్ కు అదేవిధంగా టీజర్ కు వస్తున్న స్పందన అందరికీ షాక్ ఇస్తోంది. అయితే ప్రభాస్ ‘బాహుబలి’  తో  విపరీతంగా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ అదే ప్రభాస్ ఫ్యాన్స్ కోపానికి గురి కాబడటం ఆశ్చర్య పరుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: