నేటితరం యంగ్ హీరోల లుక్ పై విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. నేటి టాప్ యంగ్ హీరోల లుక్ ను చూస్తూ ఉంటే తనకు ఆశ్చర్య కలుగుతోందని హీరో అనేవాడికి కండలు అవసరం లేదు అంటూ నేటి హీరోల సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ లుక్ పై సెటైర్లు వేసారు. నేటితరం హీరోలు గడ్డాలు పెంచుకుని ఎంత రఫ్ గా కనిపిస్తే అంత గొప్ప హీరో అనుకుంటున్నారని కేవలం గడ్డాలు పెంచుకుని కండలు పెంచుకుంటే టాప్ హీరోలు అవ్వలేరని కామెంట్స్ చేసారు సత్యనారాయణ. 

ఇదే సందర్భంలో నేటితరం నటీనటుల గురించి మాట్లాడుతూ తాను ఎదురు పడితే ఎక్కడ నమస్కారం పెట్టవలసి వస్తుందో అని హడావిడిగా వెళ్ళిపోతున్నారని ఒకవేళ తనంతట తాను విష్ చేద్దామనుకున్నా చూసిచూడనట్లు వెళ్ళిపోతున్నారని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు హైదరాబాద్ లో జరిగే ఏ సినిమా ఫంక్షన్ కి అవార్డు ఫంక్షన్స్ కీ కనీసం ఇన్విటేషన్ కూడ పంపడం లేదని ఈ పరిస్థితి చూస్తుంటే తనకు చాల ఆశ్చర్యం వేస్తోంది అంటూ ఘాటైన కామెంట్స్ చేసారు సత్యనారాయణ.

తనతరం టాప్ హీరోలు అక్కినేని ఎన్టీఆర్ ల గురించి మాట్లాడుతూ కేవలం డబ్బు కోసమే తాము నటించ లేదని ఒక పాత్ర చేయాలి జనo హృదయాలలో స్థానం సంపాదించాలి అన్న భావనతో సినిమాలు చేసామని ఇప్పుడు డబ్బే సర్వస్వం అయిపోయిందని అంటూ వ్యాఖ్యాలు చేసారు సత్యనారాయణ. ప్రస్తుతతరం నటీనటులు ఇన్ని కోట్లు ఏమిచేసుకుంటారో తనకు అర్ధం కావడం లేదని అంటూ కామెంట్స్ చేసారు. 

ప్రస్థుత తరం నటీనటులు షూటింగ్ స్పాట్ లో వ్యవహరించే తీరు గురించి మాట్లాడుతూ షూటింగ్ షాట్ గ్యాప్ లో చెట్ల నీడకింద కుర్చీలు వేసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తమ ఇంటి నుండి తెప్పించుకున్న పులిహార, బొబ్బట్లను అందరికీ షేర్ చేసుకుంటూ సరదాగా తినేవారమని అయితే నేటి తరం హీరోల వ్యానటీ వ్యాన్ వచ్చేసిన తరువాత నటీనటుల మధ్య బంధాలు ఎక్కడవనీ అంటూ నేటి తరం నటీనటుల జీవన విధాన శైలి పై అదేవిధంగా ప్రస్తుత సినిమారంగ పరిస్థితి పై అనేక సంచలన వ్యాఖ్యలు చేసాడు ఈ నవరస నటనా సార్వభౌముడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: