సినిమాకి ప్రమోషన్ , పబ్లిసిటీ అనేవి చాలా ముఖ్యమైన విషయాలు. పబ్లిసిటీ తో సినిమాని పీక్స్ కి తీసుకెళ్లడం ఈ రోజుల్లో జనాలకి బాగా అలవాటు అయిన వ్యవహారం. ప్రతీ సినిమా కీ ఓవర్ పబ్లిసిటీ చెయ్యడం, హీరో హీరోయిన్ లతో ప్రమోషన్ లో చేయించడం హైప్ ని విపరీతంగా పెంచడం ఇదొక ప్రాసెస్ లాగా సాగుతోంది. సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచీ విడుదల వరకూ ఎక్కడ హైప్ పెంచుకోవడానికి ఛాన్స్ ఒచ్చినా దాన్ని వదలకుండా నిర్మాతలూ, డైరెక్టర్ లూ , హీరో లూ రెచ్చిపోతున్నారు.

 

హైప్ అనేది చిన్న సినిమాలకి ఓకే గానీ పెద్ద సినిమాలకి కొంప ముంచే విధంగా తయారు అవుతోంది. కేవలం ఒకే ఒక్క టీజర్ తో కబాలి సినిమా ప్రమోషన్ ఆకాశానికి ఎగిరిపోయింది. నిజానికి శంకర్ డైరెక్షన్ లో రజినీకాంత్ సినిమా రోబో 2 కంటే ముందర రజినీకాంత్ కొత్త డైరెక్టర్ రంజిత్ తో సినిమా చెయ్యడానికి సంతకం పెడితే అందరూ ఆశ్చర్యపోయారు. చిన్న డైరెక్టర్ తో ఎదో చిన్న సినిమా చేస్తున్నాడు అనీ బహుసా డిస్ట్రిబ్యూటర్ ల అప్పులు తీర్చడం కోసం ఇది చేస్తున్నాడు ఏమో అనుకున్నారు. ఈ సినిమాని అసలేవ్వరూ లెక్క కూడా చెయ్యలేదు. సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని శంకర్ సినిమా వైపు రజిని త్వరగా వెళ్లాలని కోరుకున్నారు జనం.

 

కానీ కట్ చేసి చూస్తే పరిస్థితి వేరుగా ఉంది. కేవలం ఒక టీజర్ తో అంచనాలు మైండ్ బ్లోయింగ్ అయిపోయాయి కబాలి కి. టైటిల్ కూడా అద్భుతంగా ఉండడం ఫుల్ జోష్ తో కథ నిండడం చూస్తే జనాలు ఊరికినే అటువైపు మొగ్గు చూపారు. చివ్వరికి సినిమా స్లో నేరేషన్ తో అసలు గ్యాంగ్ స్టర్ సినిమా విధంగా సాగకపోవడం ఓవర్ సెంటిమెంట్ జోడించి ఉండడం తో ప్లాప్ టాక్ తెచ్చుకుంటోంది. తమిళం లో ఏమోగానీ తెలుగు ఈ సినిమా ప్లాప్ అని అప్పుడే ట్రేడ్ పండితులు తేల్చేసారు . ఇప్పటికే ఈ సంవత్సరం సర్దార్ గబ్బర్ సింగ్ , బ్రహ్మోత్సవం సినిమాలు ఈ కారణం తోనే ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు కబాలి ప్లాప్ అవ్వడానికి ముఖ్యకారణం కూడా హైప్ అనే అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: