యువ డైరెక్టర్ తమన్ ఇప్పుడు సంచలన సంగీత దర్సకుడుగా మారాడు. చేతిలో పెద్ద సినిమాలు లేకపోయినా చిన్న ప్రాజెక్ట్ లు హ్యాండిల్ చేస్తున్నాడు. ఆగస్ట్ 5 న విడుదల అవ్వబోతున్న శ్రీ రస్తు శుభమస్తు , ఆగస్ట్ 13 న విడుదల అవుతున్న తిక్క సినిమాలకి తమన్ సంగీతం అందించాడు. ఈ రెండూ పక్కన పెడితే పెద్ద సినిమాలు ఏవీ తమన్ చేతిలో లేవు. వారం గ్యాప్ లో రెండు సినిమాలు విడుదల చేస్తున్న తమన్ ఈ రెండిటిమీదా చాలా ఆశలు పెట్టుకున్నాడు.

 

ఒక పక్క సాయి ధరం తేజ సినిమా తిక్క అల్టిమేట్ మాస్ మూవీ కాగా రెండవది అల్లూ శిరీష్ సినిమా శ్రీ రస్తు శుభమస్తు పూర్తి ఫ్యామిలీ సినిమా. కేవలం రెండు అంటే రెండే వారాల గ్యాప్ లో పూర్తి డిఫరెంట్ ఆల్బం లు విడుదల చెయ్యబోతున్నాడు తమన్. ఈ రెండిటికీ ఇంకా ఆడియో వేడుక జరగలేదు . తమన్ కోసం అయినా ప్రొడ్యూసర్ లు భారీగా ఈ వేడుకలు నిర్వహించే ఛాన్స్ ఉంది. పక్క పక్కన్నే అంటే వారం వ్యవధి లో ఆడియో లు జరగచ్చు.

 

 ఈ రెండు జోనర్లూ క్లిక్ అయితే గానీ తమన్ భవిష్యత్తు సెట్ అయ్యే ఛాన్స్ కనపడ్డం లేదు. తమన్ కి కిక్ 2 తరవాత పెద్ద సినిమా చేతిలోకి రాలేదు. ఒక పక్క అనూప్ రుబెన్స్ తమన్ కి ప్రత్యర్ధి గా చాలా సినిమాలు చేస్తుంటే. పెద్ద హీరోలకి దేవీ శ్రీ ప్రసాద్ ఎప్పటి లాగానే మ్యూజిక్ ఇస్తూ వెళుతున్నాడు. దాంతో తమన్ ఈ రెండు ప్రాజెక్ట్ ల మీదా ప్రతీ పాట నీ పర్టిక్యులర్ గా ఎంచుకుని మరీ డీల్ చేస్తున్నాడు అని తెలుస్తోంది. మెలోడీ కి మెలోడీ మాస్ బీట్ లకి మాస్ బీట్ లూ తమన్ చాలా ఇంటరెస్టింగ్ గా ఇచ్చాడు అని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: