ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో థియోటర్స్ వద్ద హల్ చేస్తున్న మూవీ కబాలి. కబాలి మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే మొదటి రోజు కబాలి మూవీకి అన్ని చోట్ల నుండి యావరేజ్ టాక్ వస్తే, ఒక్క తెలుగులో మాత్రం నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు మార్కెట్ లో కబాలి మూవీ బ్లాక్ బస్టర్ కావటం సాధ్యం కాని విషయంలా మారింది.


అయితే వీకెండ్ సమయం చూసుకొని రిలీజ్ అయిన కబాలి మూవీకి కేవలం 3 రోజుల్లోనే కలెక్షన్స్ వచ్చి తీరాలి. అందులోనూ ఆ కలెక్షన్స్ తో నిర్మాత సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి. ప్రస్తుతం కబాలి మూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ ని చూస్తే...ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతకి కొంత మేర నష్టాలు తప్పవని అంటున్నారు. తెలుగులో రజనీకాంత్ కి మార్కెట్ ఉన్నప్పటికీ...సినిమాపై నెగిటివ్ టాక్ రావటంతో మొదటి మూడు రోజుల తరవాత ఈ మూవీకి కలెక్షన్స్ అనేవి పడిపోయే ఛాన్స్ ఉంది.


ఇక కబాలి తెలుగు వెర్షన్ కి సంబంధించి మొదటి మూడు రోజులలో 30 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయటం కష్టమే అని అంటున్నారు. తరువాత మరో వారం రోజుల పాటు మూవీ థియోటర్స్ లో యావరేజ్ గా ప్రదర్శన జరుపుకుంటేనే నిర్మాతకి చెప్పుకోదగ్గ లాభాలు వస్తాయని, లేదంటే కనీసం 2,3 కోట్ల రూపాయలను నష్టపోవవల్సి ఉంటుందని అంటున్నారు.


ఇక తమిళనాడులో ఇప్పటికే ఈ మూవీపై భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మరో వారం రోజుల పాటు తమిళనాడు థియోటర్స్ అన్నీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నిండిపోయాయి. దీంతో కోలీవుడ్ లో కబాలి మూవీ రికార్స్ కలెక్షన్స్ ని కొల్లగొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: