సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన అన్ని చోట్ల ఈ మూవీ 100 శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శనలు జరుపుకోవటంతో ఈ మూవీకి సంబందించని కలెక్షన్స్ సైతం భారీగా నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లు అన్నీ అనుకున్నదానికంటే ఎక్కువుగానే కలెక్షన్స్ ని నమోదు అయ్యాయి. తెలుగు, తమిళ భాషలలో ఈ మూవీ విదేశాల్లో రిలీజ్ అయింది.

ఇక బాక్సాపీస్ కలెక్షన్స్ వివరాల ప్రకారం ఇంటర్నేషనల్ మార్కెట్ లో మొదటి స్థానంలో మలేషియా ఉంది. ఆ తరువాత యుఎస్, కన్నడ, యుకె దేశాలు ఉన్నాయి. ఒక్క యుస్, కెనడ లోనే ఈ మూవీ ప్రీమియర్ షోల ద్వారా దాదాపు 13 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.  తెలుగులో 17 కోట్ల రూపాయలు, తమిళంలో 19 కోట్లరూపాయలు, కన్నడ, హిందీ లో 7 కోట్ల రూపాయలు,  ఇతర ఓవర్సీస్ ప్రాంతాల్లో  8 కోట్ల రూపాయలను ఈ మూవీ కొల్లగొట్టి మొత్తంగా 64 కోట్ల రూపాయలకు చేరుకుంది.

ట్రేడ్ వర్గాలకి సంబంధించిన ఈ సమాచారం ప్రస్తుతం సర్కులేట్ అవుతుంది. దీంతో కబాలి మూవీ మొదటి రోజు కలెక్షన్స్ 50 కోట్ల రూపాయల మార్క్ ని టచ్ చేయటమే కాకుండా 100 కోట్ల రూపాయలకి దగ్గరలోనే ఉందని అంటున్నారు. ఇక వీకెండ్ సెలవులు ఉండటంతో ఈ కలెక్షన్స్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మొత్తంగా మొదటి రోజుల కలెక్షన్స్ ని చూసుకుంటే ఈ మూవీ కచ్ఛితంగా 200 కోట్ల రూపాయలకి దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఈ మూవీకి చూపించిన ఆసక్తి కారణంగానే ఓపెనింగ్ కలెక్షన్స్ అధిరిపోయేలా ఉన్నాయని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: