నితిన్, సమంత కాంబినేషన్ లో వచ్చిన త్రివిక్రమ్ మూవీ అ..ఆ. ఈ మూవీ రిలీజ్ రోజు నాటి నుండి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకోవటంతో కలెక్షన్స్ పరంగానూ మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి ఓవర్సీస్ మార్కెట్ లోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ రిపోర్ట్ ని చూస్తే, ఇప్పటి వరకూ ఈ మూవీ యుఎస్ లో 17 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.


ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ని 9 కోట్ల రూపాయలను కొన్న నిర్మాతకి దాదాపు ఇప్పుడు 8 కోట్ల రూపాయల లాభాలను తెచ్చింది. దీంతో ఆ డిస్ట్రిబ్యూటర్ ఫుల్ హ్యాపీలో ఉన్నాడు. ప్రస్తుతం అ..ఆ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న త్రివిక్రమ్, నెక్ట్స్ మూవీకి సంబంధించని ఏ నిర్ణయాన్ని తీసుకోవలేదు. కొంత మంది సూర్యతో అంటుంటే, మరికొంత మంది జూనియర్ ఎన్టీఆర్ తో అంటున్నారు.


అయితే సూర్య ప్రాజెక్ట్ కొన్ని కారణాలతో దూరం జరిగిందని అంటున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. త్రివిక్రమ్ మాత్రం తాజాగా ఓ స్క్రిప్ట్ కి సంబంధించిన పనులను ప్రారంభినట్టుగా తెలుస్తుంది. అలాగే తను ఎవరితో మూవీని తీయబోతున్నారు అనే విషయంపైనా త్వరలోనే ఓ ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించనున్నారు.


ఇక తను తెరకెక్కించిన అ..ఆ మూవీ అన్ని చోట్ల మంచి లాభాలతో ఉండటంతో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కి త్రివిక్రమ్ కి స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నారు. అ..ఆ మూవీకి లాభాలు పొందిన డిస్ట్రిబ్యూటర్స్, త్రివిక్రమ్ తరువాత మూవీకి సైతం ముందుగానే డీలింగ్స్ ని మాట్లాడుకోవటం ఇక్కడ విశేషంగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: