టాలీవుడ్ అంతా ప్రస్తుతం రాజమౌళి గొప్పతనం గురించి ప్రశంసలు కురిపిస్తూ జక్కన్నను ఉన్నతమైన స్థానంలో కూర్చో పెడితే ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ రాజమౌళి తీసిన ‘బాహుబలి’ ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చాల మందికి ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నాయి. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైకాల ఈ వ్యాఖ్యలు చేసాడు. 

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ‘బాహుబలి’ గురించి మాట్లాడుతూ ఈసినిమాలో కథ లేదని అదే విధంగా డైలాగ్స్ సంగీతం ఏదీ గొప్ప స్థాయిలో లేవని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు కైకాల. అంతేకాదు ఈసినిమాలోని యాక్షన్ సన్నివేశాలు కూడ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ లేకుండా చూస్తే ఏ మాత్రం గొప్పగా అని పించవని కేవలం భారీ ఖర్చు కనిపిస్తుంది కానీ అంతకు మించి ‘బాహుబలి’ లో ఎటువంటి గొప్పతనం లేదు అంటూ సెటైర్లు వేసాడు ఈ విలక్షణ నటుడు.

అయితే ఈ ఇంటర్వ్యూ చదివిన వారికి ఒక సందేహం కలగడం సహజం. తెలుగు సినిమా ఖ్యాతిని 75 సంవత్సరాలు తరువాత ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్ళిన రాజమౌళిని టార్గెట్ చేస్తూ ఒకనాటి సీనియర్ నటులు ఎందుకు కామెంట్ చేస్తున్నారు అన్నది అర్ధం కాని ప్రశ్నగా మారింది. కొద్ది కాలం క్రితం జమున కూడ ఇలాగే ‘బాహుబలి’ ని టార్గెట్ చేస్తూ ఈసినిమా గొప్ప సినిమా కాదు అంటూ కామెంట్స్ చేసారు. దీనితో టాలీవుడ్ సీనియర్ నటులకు ఎవ్వరికీ ‘బాహుబలి’ నచ్చలేదా అనే సందేహం కలగడం సహజం..  

ఇదే సందర్భంలో ఒకనాటి  జానపద  సినిమాల  దర్శకుడు విఠాలాచార్య గురించి మాట్లాడుతూ ఎటువంటి టెక్నాలజీ లేని అలనాటి రోజులలో జానపద సినిమాలు తీసి ఎన్నో విజయాలు సాధించిన విఠాలాచార్య  సినిమాలు ‘బాహుబలి’  స్థాయికంటే గొప్పవి అని అర్ధం వచ్చేడట్లుగా మాట్లాడుతూ కైకాల చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: