మెగాస్టార్ చిరంజీవి టైం అసలు బాలేదన్నట్టు ఉంది. ప్రస్తుతం చేస్తున్న కత్తి సినిమా మొదలుపెట్టడానికి ముందే ఎన్నో అవాంతరాలు ఎదురైన సంగతి తెలిసిందే. అయితే అవన్ని ముగించుకుని షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రయూనిట్ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాకపోవడం ఓ పెద్ద సమస్యగా మారింది. అసలు చిరు సినిమా అంటే పరుగెత్తుకుంటూ మేమంటే మేమని పోటీ పడతారనుకున్న హీరోయిన్స్ కాస్త చిరు సినిమానా అయితే వద్దులే అన్నత పని జరుగుతుంది.


అయితే కొన్ని కారణాలేమో కొడుకు, అల్లుళ్లతో నటించి వారిని తన పక్కన హీరోయిన్ గా చేసుకోవడం నచ్చని చిరు కొంతమందిని దూరం పెడితే ఇప్పుడు చిరు పక్కన సరితూగే వారేమో చుక్కలు చూపిస్తున్నారట. ఇక చిరు హీరోయిన్ కోసం బాలీవుడ్ మొత్తం ఓ చుట్టేసి వచ్చిన దర్శక నిర్మాతలు మళ్లీ సౌత్ బ్యూటీల మీదే ఆధారపడ్డారు. 


ఓ మాట ప్రస్తుతం కాజల్ తో సంప్రదింపులు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చిరు సినిమా అనగానే గొప్ప అవకాశం అని అంటుందనుకున్న కాజల్ చిరు సినిమానా ఓకే కాని రెండున్నర కోట్లు రెమ్యునరేషన్ అంటుందట. దాదాపు కెరియర్ అయిపోయింది అనుకుంటున్న టైంలో లక్కీగా వచ్చిన మెగాస్టార్ ఆఫర్ ను కాజల్ ఇలా డిమాండ్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.   


చిరు పక్కన ప్రస్తుతం ఉన్న భామల్లో కాస్త కూస్తో క్రేజ్ ఉన్న కాజల్ నే పెట్టే ఆలోచనలో ఉన్న చిత్రయూనిట్, ఆమెతో బేరసారాలు ఆడుతున్నారట. మరి చిరు సినిమాకు హీరోయిన్ లేకుండానే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రెండో షెడ్యూల్ కూడా కానిచ్చేస్తున్నాడన్నమాట. మెగా మూవీలో హీరోయిన్ ఓకే అన్న వార్త కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: