సినిమా పరిశ్రమ కి సెంటిమెంట్ ల గోల మామూలే , షూటింగ్ మొదలు పెట్టాలి అన్నా సినిమా విడుదల చెయ్యాలి అన్నా హీరోయిన్ ఎంపిక జరగాలి అన్నా ఆఖరికి డైరెక్టర్ చెప్పే కొత్త కథ వినాలి అన్నా కూడా సెంటిమెంట్ లు వాడుతూనే ఉంటారు అందరూ. అలాగే పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు లకి కూడా సెంటిమెంట్ లు ఉన్నాయి. ఈ ఇద్దరు పెద్ద స్టార్ హీరోలూ త్వరలో తమ సినిమాలని మొదలు పెట్టాల్సి ఉంది కానీ లేటు లేటు అవుతూనే ఉంది. అదిగో ఇదిగో అంటూ చెబుతున్నారు తప్ప సినిమాలు మాత్రం సెట్స్ మీదకి వెళ్ళడం లేదు.

 

మహేష్ బాబు - మురగదాస్ లాంటి భారీ డైరెక్టర్ తో సినిమా ఓకే చెయ్యగానే అందరూ ఆశ్చర్యపోయారు , ఒకింత ఎక్సైట్ అయ్యారు కూడా. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్ లు ఇప్పటి నుంచే అడ్వాన్స్ లు ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ సినిమా మాత్రం ఇంకా మొదలే కాలేదు మొత్తానికి వీరి సినిమాకి ముహూర్తం కుదిరినట్టే కనిపిస్తోంది. ఇక పోతే పవన్ కళ్యాణ్ సంగతి అందరికీ తెలిసిందే. ఆయన సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది, డైరెక్టర్ ఎవరూ, నిర్మాత ఎవరు, షూటింగ్ మొదలు అయ్యేది ఎప్పుడు, పూర్తి అయ్యి విడుదల అయ్యేది ఎప్పుడు అంటూ ప్రతీ సినిమాకి ఎదో ఒక సస్పెన్స్ నడుస్తూనే ఉంటుంది.

 

 సూర్య ని డైరెక్టర్ గా పెట్టి సినిమా మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ అతన్ని తీసేసి డాలీని తీసుకున్న సంగతి తెలిసిందే. సడన్ గా డాలీ ని రంగంలోకి దింపడం తో పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. ఈ సినిమాతో ఏమాత్రం సంబంధం లేని, స్క్రిప్ట్ తాను రాయని డైరెక్టర్ అవడం తో డాలీ ఈ కథ మీద కాస్త టైం కావాలి అని అడిగాడట. సో ఈ షూటింగ్ మొదలు కావాలి అంటే టైం పట్టేలానే ఉంది. పవన్ అంటే ఏమో అనుకోచ్చు గానీ ఈ సారి మహేష్ కూడా లేట్ చేస్తున్నాడు. మహేష్ 29 న సెట్స్ మీదకి వెల్లబోతున్నాడు. వరసగా చెన్నై - ముంబయి - గుజరాత్ - పుణె - హైదరాబాద్ ల్లో షెడ్యూళ్లు ప్లాన్ చేశారట. నిర్విరామంగా షూటింగ్ జరుగుతుందట. ఈ డేట్ ని మహేష్ సెంటిమెంట్ గా పెట్టుకున్నాడు అని అంటున్నారు. అలాగే ఆగస్ట్ మొదటి వారం లో 6వ తారీఖు న పవన్ తన సెంటిమెంట్ ప్రకారం కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: