అంచనాల మీద అంచనాలు రేపి చివరికి నీరు గార్చేసింది కబాలి. ఆ తరహా నీరు గార్చిన సినిమాలు ఈ మధ్య కాలంలో బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద హీరోలు అయిన పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు లు ఇద్దరూ తమ సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం తో ఒకదాని వెనకాల ఒకటి విడుదల చేసి మరీ ప్రేక్షకుడిని నిరుత్సాహపరిచారు. కానీ కబాలి లెక్క అలా కాదు వారిద్దరి సినిమాల కంటే కూడా రజిని సినిమా మీద విపరీతమైన క్రేజ్ పెరిగింది.

 

 రజిని ని మరొక బాషా టైపు లో చూడ్డం కోసం ప్రేక్షకుడు థియేటర్ కి వెళ్ళగా అక్కడ ఎదో గజిబిజి గ్యాంగ్ వార్ చూపించి ఇబ్బంది పెట్టాడు రంజిత్. అయితే అసలే సినిమా కన్ఫ్యూజ్ చెయ్యడం తో యాంటీ క్లైమాక్స్ ఎండింగ్ పడింది ఈ సినిమాకి. కబాలి దగ్గర పనిచేసే వ్యక్తి స్వయంగా గన్ను తీసి రజిని ని కాల్చడానికి ప్రయత్నం చెయ్యడం తో గన్ షాట్ సౌండ్ వినపడుతుంది. కబాలి చంపబడ్డాడా లేక ఏమయ్యాడు అనే దానికి జవాబు మనమీడనే వదిలేసాడు పా రంజిత్. గ్యాంగ్ స్టర్ అనే వ్యక్తికి నిత్యం చుట్టూరా శత్రువులు ఉంటారు. ఆ ఉద్దేశ్యం తో ఇది చేసి ఉండచ్చు.

 

కమల్ హాసన్ సినిమా నాయకుడు లో మణిరత్నం కూడా ఇలాంటి పనే చేసారు. కానీ ఈ సినిమా ప్లాప్ అవ్వడం తో ప్రేక్షకులు కామెడీ చెయ్యడం మొదలు పెట్టారు. కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనే రొచ్చు లో టైగర్ కబాలి ని ఎందుకు చంపాడు అని బోలెడు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కబాలి 2 తీయాలి అనే వరస్ట్ ఆలోచన పా రంజిత్ కి ఉందేమో అని ప్రేక్షకుల తో పాటు విశ్లేషకులు కూడా గెస్ చేస్తున్నారు. ఉండచ్చు కుర్ర దర్శకుడు కాబట్టి ఈ కోరిక అతనికి ఉండచ్చు , సినిమా రిజల్ట్ చూడక ముందర అతను అలా అలోచించి ఉండచ్చు. సినిమా అంతా గాంగ్ స్టర్ మోడ్ లో సాగడం తో ఈ సినిమాని తెలివిగా ముగించి సీక్వెల్ తీయాలి అని రంజిత్ అనుకుని ఉండచ్చు గాక. కానీ ఈ పేలవమైన ఫలితం చూసాక ఇంకా అతని మనసులో కబాలి 2 ఆలోచన అసలు బతికి ఉంటుందా అనేది అసలు ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: