గాయని సునీత పేరు వినని వారుండరు. చూడటానికి చాల గ్లామర్ గా చిన్నదానిలా కనిపించే సునీతకు 17 ఏళ్ల కొడుకు 14 ఏళ్ల కూతురు ఉన్నారు అన్న విషయం చాలామందికి తెలియని నిజం. అటువంటి అందమైన సునీత మనసుకు ఒక బలమైన గాయం అయింది. ఆ గాయం తాలూకు విషయాలను తన వ్యక్తిగత జీవితం పై వచ్చిన అనేక రూమర్లకు ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టింది.

తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త గురించి మాట్లాడుతూ ఎవరినైనా భరించవచ్చు కాని పక్కనే భర్తగా తనతో జీవితం పంచుకుంటూ మోసం చేసే వారిని భరించలేం అనిఅంటూ తన భర్త తనని మోసం చేసాడు అంటూ ఒకసంచలన విషయాన్ని బయటపెట్టింది సునీత. ఆమధ్య ఒకప్రముఖ రాజకీయ వేత్తతో తనకు సంబంధం ఉంది అంటూ కొన్ని మీడియా వర్గాలలో వచ్చిన వార్తల వల్ల తాను ఎంతో ఆశ్చర్య పోయానని భర్త ఎలా ఉన్నా సద్దుకుపోయి ఉంటే ఇలాంటి లింకప్ రూమర్స్ వచ్చి ఉండేవి కాదుకదా అని ఆక్షణంలో బాధ పడ్డానని తన భావాలను షేర్ చేసుకుంది సునీత. 

ఈమధ్య తాను వేరొకరిని రహస్యంగా పెళ్ళిచేసుకున్నానని అదేవిధంగా తాను ఆర్ధక సమస్యలలో ఉన్నానని రకరకాల రూమర్స్ తన పై పుట్టించారు అన్నవిషయాన్ని చెపుతూ తన డిగ్నిటీని వదులుకునే పనులు తాను ఏనాడు చేయనని తన క్యారెక్టర్ బ్యాడ్ చేయడం వల్ల ఎవరికీ ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో తనకు తెలియదని తన మనసుకు తగిలిన గాయాన్ని వివరించింది సునీత. 

తనవ్యక్తిగత జీవితం పై వచ్చిన రూమర్ల వల్ల తనకు సినిమాలలో అవకాశాలు కూడ కొంత వరకు తగ్గిన విషయాన్ని చెపుతూ తమన్ దేవిశ్రీ ప్రసాద్ అనూప్ రూబెన్స్ లాంటి  టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్త వాయిస్ ల కోసం చూస్తున్నప్పుడు సహజంగానే తనలాంటి వారికి అవకాశాలు తగ్గుతాయని షాకింగ్ కామెంట్స్ చేసింది సునీత. ప్రస్తుతం సినిమాపాటలకు సంబంధించి వాయిస్ ప్రాసెస్ పరిస్థుతులు ఉన్న నేపధ్యంలో ఎవరుపాడినా అది ఒకే అన్నట్లుగా అనిపిస్తుందని అనుభం ఉన్నసింగర్లు మాత్రమే పాడాలని రూల్ లేదు అని అంటూ సెటైర్లు వేసింది సునీత. సినిమాలలో తన చేత పాటలు పాడించుకుని డబ్బులు ఎగ్గొట్టిన వారి లిస్టు ఇస్తానని ఎవరైనా ఆ డబ్బులు వసూలు చేసి పెట్టి తనకు ఇస్తే ఆ డబ్బులో సగం ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించింది సునీత. త్వరలో ఆన్ లైన్ సంగీతం క్లాస్ లు సారీ డ్రెస్ డిజైనింగ్ క్లాసులు చేపట్టడం తన యాంబిషన్ అంటూ సునీత అనేక సంచలన విషయాలను ఈఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: