సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించే అవకాశం చాలా కొద్ది మందికే వస్తుంది. అయితే ఆ క్యారెక్టర్ కోసం నటులు ఎంతగానో కష్టపడతారు. ఇక భారత దేశ సినీ చరిత్రంలో ఎన్నో ప్రయోగాత్మాక చిత్రాల్లో నటించిన క్రెడిట్ విశ్వనటుడు కమల్ హాసన్ కే దక్కింది.  ఆ తర్వాత విక్రమ్ మాత్రమే కొన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలంటే చాలా మంది జంకుతారు..ఎందుకంటే తమ గ్లామర్ కి ఏవైనా తేడాలు వస్తాయన్న భయంతో కానీ  అందాల భామ అనుష్క మాత్రం ఇలాంటివి పట్టించుకోకుండా సైజ్ జీరో చిత్రంలో లావుగా కనిపిస్తూ అందరినీ అబ్బుర పరిచింది.

తాజాగా ఇప్పుడు గోవా బ్యూటీ  నడుం వొంపుల భామ ఇలియానా డి గ్లామర్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్య పరిచింది.  వాస్తవానికి ఇలియానా చాలా చక్కటి అందం మంచి ఫిట్ నెస్ ఉన్న భామ. తెలుగులో దేవదాసు చిత్రం తర్వాత అగ్రహీరోలతో నటించి అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ లీస్టు లో చేరిపోయింది. ఈ అమ్మడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ వచ్చిన చాన్స్ లు కాదనుకోవడంతో ఆమె ప్లేస్ లో కాజల్, త్రిష,సమంత లాంటి హీరోయిన్లు దూసుకు వచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రాలు ఏవీ లేవు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో నటిస్తున్న ‘రుస్తుం’ పై ఎన్నో ఆశలు ఉన్నాయి.

అయితే ఈ చిత్రంలో ఇలియాన్ అందంగా గ్లామర్ కనిపించదట. 1950 సంవత్సర కాలం నాటి గెటప్‌లో కనిపించేందేకు శరీరాకృతిని కూడా పూర్తిగా మార్చేసుకుంది. కాస్ట్యూమ్‌ విషయంలోను పూర్తి దృష్టి సారించింది ఈ గోవా భామ.   తాజాగా తన ఇన్‌స్ట్రాగ్రాం లో ఓ ఫోటోను పోస్ట్‌ చేసింది ఇలియానా. కొత్త సినిమాలో నా లుక్ ఎలా ఉంటుందో అందరికి చెబుతానని, కొన్ని పిచ్చి ఫోటోలను కూడా అందరికి షేర్ చేస్తానని ఈ భామ పేర్కొంది.  ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఇలియానా ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: