ఒక టాప్ దర్శకుడు మిల్కీ బ్యూటీ తమన్నా కోసం చేసిన త్యాగం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారి తమన్నా కోసం ఆ దర్శకుడు ఎందుకు అంత త్యాగం చేసాడు అనే మాటలు కూడ వినిపిస్తున్నాయి. షాకింగ్ గా మారిన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ఒక వ్యక్తి ఏర్పడ్డ సెంటిమెంట్ ఆ వ్యక్తి పై ఎటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఈ సంఘటన ఒక ఉదాహరణ. 

సినిమా సెలెబ్రెటీలకు సెంటిమెంట్లు ఎక్కువ అన్న విషయం తెలిసిందే. దానికితోడు సక్సస్ లు లేనప్పుడు ఈ సినేతిమెంట్లు మరింత ప్రభావితం చేస్తాయి. దర్శకుడు సంపత్ నంది పరిస్థితి కూడ ఇలాగే ఉంది. ప్రస్తుతం ఈ దర్శకుడు గోపీ చంద్ హీరోగా తీయబోతున్న ఒక సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను క్రియేట్ చేసి ఆ సాంగ్ ను తమన్నా చేత చేయించాలని విపరీతమైన పట్టుదలగా ఉన్నాడని టాక్. అయితే తమన్నా వల్ల ఈ మూవీ బడ్జెట్ పెరుగుతుంది అన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా నిర్మాతలు సంపత్ నంది ఆలోచనలకు బ్రేక్ వేస్తున్నట్లు టాక్.

ఈ విషయాన్ని గ్రహించిన సంపత్ నంది సెంటిమెంట్ రీత్యా ఈ సినిమా సక్సస్ కావాలి అంతే తమన్నా ఐటమ్ ఉండి తీరాలని అవసరం అనుకుంటే తమన్నాకు ఇచ్చే పారితోషికం, తన పారితోషికం నుండి తగ్గించుకోమని ఈసినిమా నిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు టాక్.   సంపత్ నంది మాటలు విన్న ఈ సినిమా నిర్మాతలు ప్రస్తుతం తల పట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. 

ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన ‘రచ్చ’ ‘బెంగాల్ టైగర్’ సినిమాలలో తమన్నా నటించడంతో ఆమె ఉంటే చాలు హిట్ వస్తుంది అయి సంపత్ నంది నమ్మకం. ఈ వార్తలు తెలుసుకున్న తమన్నా సంపత్ నంది తన పై చూపెడుతున్న అభిమానానికి మురిసిపోయి ఈసినిమా ఐటమ్ సాంగ్ కు సంబంధించి భారీగానే డిస్కౌంట్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఏమైనా కష్టాలలో ఉన్న సంపత్ నందిని తమన్నా సెంటిమెంట్ ఎంతవరకు కాపాడుతుందో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: