సౌత్లో సూపర్ స్టార్ గా వెలుగొందే హీరోల్లో తమలోని విలక్షణతతో కోట్లాదిమంది అభిమానులను ఏర్పరచుకున్న రజినికాంత్, కమల్ హాసన్ ఇద్దరూ ఇద్దరే అని చెప్పాలి. అయితే రజిని ఫ్యాన్స్ కాస్త ఎక్కువ హడావిడి చేస్తుంటారు. అందుకే సినిమాల బిజినెస్ లో కూడా రజిని భారీ రేంజ్ బిజినెస్ మామూలే. కమల్ మాత్రం సినిమా హిట్ అయితేనే క్రేజ్ లేదంటే ఏం ఉండదు. 


రజిని సినిమా ఫలితాల వల్ల నష్టాల పాలయ్యే పంపిణీదారుల సంఖ్య కూడా అంతే. ఆల్రెడీ కొచ్చాడియన్, లింగా సినిమాల వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఓ పక్క ఫైట్ చేస్తుంటే మరో పక్క రీసెంట్ గా కబాలి ఇచ్చిన షాక్ కు మళ్లీ ఇబ్బంది పడుతున్నారు. అయితే రజిని సినిమా ముందు ఎంత భారీ బిజినెస్ చేస్తుందో అదే సినిమా ఫ్లాప్ అయితే అంతలా లాస్ తీసుకువస్తుంది.


ఇక కమల్ సినిమాలు ఫ్లాప్ అయినా నిర్మాత గాని డిస్ట్రిబ్యూటర్లు కాని అంత పెద్ద లాస్ అయ్యే అవకాశాలు ఉండవు. మరి పరిశ్రమ పది కాలాల పాటు పచ్చగా ఉండాలంటే సినిమాను కొనే పంపిణీదారులు సినిమాలను కొనాలి. అలా కాకుండా ప్రతి సినిమాకు వారు నష్టాల పాలయితే ఇక పెద్ద సినిమాలను కొనేందుకు భయపడతారు.
కబాలి క్రేజ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినా సినిమా కలక్షన్స్ మాత్రం కొద్దికొద్దిగా స్లో అవుతున్నాయి. మరి ఈ విషయంలో రజిని కన్నా కమల్ బెటర్ అనేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: