సూపర్ స్టార్ రజినికాంత్ తో కబాలిగా సెన్షేషన్ క్రియేట్ చేస్తాడేమో అనుకున్న పా.రంజిత్ కబాలిని అటు హిట్టుకు ఇటు ఫ్లాప్ కు మధ్యలో ఉండేలా చేశాడు. సినిమాకు వచ్చిన ప్రీ రిలీజ్ బజ్ తో సినిమా ఆడేస్తుంది కాని విషయం పెద్దగా ఏమి లేదని మొదటి రోజే తెలిసింది. అయితే ఇప్పుడు కబాలి నిర్మాత సూర్యతో చేస్తున్న సినిమా మీదే అందరి దృష్టి పడ్డది.


రజిని అంతటి వాడిని మెప్పించిన రంజిత్ సూర్యను ఒప్పించాడు. అయితే కబాలి రిజల్ట్ చూశాక కూడా రంజిత్ కు సూర్య అవకాశం ఇస్తాడా అన్న ఆలోచన మొదలైంది. ఓ రకంగా సూర్య ఫ్యాన్స్ నుండి కూడా రంజిత్ మీద అసంతృప్తి మొదలయ్యిందట. రంజిత్ కబాలితో హిట్ కొడతాడు ఇక సూర్య తర్వాత చేయడమే అనుకున్న ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చినట్టు అయ్యింది.


ఇక రంజిత్ సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రం సినిమాను కూడా పక్కన పెట్టేశాడు సూర్య. మరి ఫ్లాప్ డైరక్టర్ తో చేస్తాడా లేక ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడా అన్నది చూడాలి. రీసెంట్ గా వచ్చిన 24, మేములతో అలరించిన సూర్య తెలుగు, తమిళ భాషల్లో త్రివిక్రం తో జతకడితే ఆ ప్రాజెక్ట్ కు నిజంగానే క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: