ప్రముఖ నిర్మాత దగ్గుబాటి  సురేష్ బాబు ఈవారం విడుదల కాబోతున్న తన ‘పెళ్ళి చూపులు’ సినిమాను ప్రమోట్ చేస్తూ తన పెద్దకొడుకు రానా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. రాబోతున్న రెండు ఏళ్ళలో రానా కు పెళ్ళి చేయాలని తాము ఆలోచిస్తున్నాము అంటూ రానా పెళ్ళివార్తలను బయట పెట్టాడు సురేష్ బాబు. అయితే రానా తన పెళ్ళికి సంబంధించి  పెళ్ళిచూపులు లాంటి అవకాశాన్ని తనకు కలుగచేస్తాడో ? లేదో తనకు తెలియదు అంటూ రానా పై సెటైర్లు వేసాడు సురేష్ బాబు.

దీనినిబట్టి చూస్తూ ఉంటే రానా కూడ ప్రేమ పెళ్లికే ఓటు వేస్తాడా అనే అనుమానాలు కలగడం సహజం. సందర్భం లో ఈవారం విడుదల కాబోతున్న ‘పెళ్ళి చూపులు’ సినిమా గురించి సురేష్ బాబు మాట్లాడుతూ  ఈమధ్య  తమ బేనర్ నుంచి తరచుగా సినిమాలు రాకపోవడం పై ఆశక్తికర కామెంట్స్ చేసాడు. తమ  బేనర్లో సినిమా వచ్చి రెండేళ్ళు దాటిపోయిన సందర్భన్ని ప్రస్తావిస్తూ కథల విషయంలో తాను అసలు రాజీ పడనని   తమ  బేనర్‌కు  మంచి పేరు ఉన్న నేపధ్యంలో తీసిన సినిమా తేడా వస్తే డబ్బులతో పాటు పరువు కూడ పోతుందనే భయంతో ఈమధ్య సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు ఈ ప్రముఖ నిర్మాత. 

ఇదే సందర్భంలో మరో  విషయాన్ని కూడా బయట పెట్టాడు సురేష్   బాబు  త్వరలో చైతూ హీరోగా తాను ఒక  సినిమా నిర్మించబోతున్నట్లు ఆ తరువాత వెంకటేష్ హీరోగా మరో సినిమా ఆపై రానాతో కూడ తాను ఒక సినిమా తీయబోతున్నట్లు తెలియచేసాడు. అయితే మీడియా లో వార్తలు వస్తున్నట్లుగా వెంకటేష్ రానాలతో కలిపి ఒక మల్టీ  స్టారర్ తీసే ఉద్దేశం ప్రస్తుతానికి తనకు లేదు అంటూ ఒక క్లారిటీ ఇచ్చాడు సురేష్  బాబు. 

 ఈ వారం విడుదల కాబోతున్న చిన్న సినిమా పెళ్ళి చూపులు అందరికీ షాక్ ఇచ్చి ఒక సైలెంట్ హిట్ గా మారుతుంది అన్న నమ్మకం  సురేష్ బాబు మాటలలో కనిపించింది అని మీడియా వర్గాలు కామెంట్ చేసుకున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: