భారీ అంచనాలతో విడుదలైన ‘కబాలి’ ఫెయిల్యూర్ బాలకృష్ణ చిరంజీవిలకు హెచ్చరికలు ఇస్తోందని కొంతమంది టాలీవుడ్ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మెగా స్టార్ 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ అదేవిధంగా బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాలు ఒకదానిపై ఒకటి పోటీగా నిర్మాణం అవుతున్న నేపధ్యం తెలిసిందే. 

అయితే  సినిమాలలో కూడ సరైన కంటెంట్ లేకుండా కేవలం బాలయ్య చిరంజీవిల ఇమేజ్ ని నమ్ముకుని ఈ సినిమా దర్శకులు క్రిష్ వినాయక్ లు ఈ సినిమాలను చుట్టేస్తే రాబోతున్న సంక్రాంతి రేసులో ‘కబాలి’ పట్టిన పరిస్థితి ఈ రెండు సినిమాలకు పెట్టే అవకాశం ఉందని విశ్లేషకుల వాదన. ఇప్పటివరకు క్రిష్ తీసిన సినిమాలలో కంటెంట్ పరంగా ఇంప్రెస్ చేశాడు కానీ  ఏ సినిమా షయం లోను భారీ విజయాన్ని అందుకోలేక పోయాడు. 

ఇక బాలయ్య సినిమా అంటే నందమూరి అభిమానులలో విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలలో ఏ మాత్రం తేడా వచ్చినా బాలకృష్ణ సినిమాకి మొదటి షో నుండి నెగిటివ్ టాక్ వైరల్ లా స్ప్రెడ్ అయిపోతుంది. ఇక చిరంజీవి సినిమా విషయానికి అంచనాలు బాలయ్య సినిమాకు రెట్టింపు ఉంటాయి. దాదాపు 9 సంవత్సరాల తరువాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో ఈసినిమాలో ఏ మాత్రం తేడా కనిపించినా మెగా అభిమానులు తీవ్రంగా రియాక్ట్ అవుతారు. 

ఇకపోతే దర్శకుడు వినాయక్ అఖిల్ పరాజయం తరువాత తీస్తున్న చిరంజీవి ‘కత్తిలాంటోడు’ కేవలం ఒక రీమేక్ స్టోరీ.  ఇందులో అద్భుతాలు ఏమి ఉండవు. దీనితో అటు క్రిష్ కాని ఇటు వినాయక్ కాని కేవలం హైక్  క్రియేట్ చేసి టీజర్లతో  హడావిడి చేసి సినిమాలో మటుకు ఎటువంటి విషయం లేకుండా చూపిస్తే ఈ సినిమాలను భారే మొత్తాలకు కొనుక్కునే బయ్యర్లు మాత్రమే కాకుండా చిరంజీవి బాలకృష్ణల ఇమేజ్ పై చెరగని మచ్చగా మిగిలిపోయే అవకాశం ఉందని రజనీకాంత్ సినిమా ‘కబాలి’ హెచ్చరికలు జారీ చేస్తోంది అంటూ ఫిలింనగర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: