సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన కబాలి మూవీ రెండు కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి. కోలీవుడ్ కి చెందిన ఈ ట్రేడ్ రిపోర్ట్స్ సంచలనాలకు దారి తీస్తున్నాయి. అయితే కబాలి మూవీ మొదటి రోజు కలెక్షన్స్ పై నిర్మాత కలైపులి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీకి ఆశ్ఛర్యాన్ని కలిగిస్తున్నాయి. దీన్ని ఎవ్వరూ అంతగా విశ్వసించటంలేదని బిటౌన్ వర్గాలు సైతం చెబుతున్నాయి.

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం, కబాలి నిర్మాత నుండి వస్తున్న సమాచారం ఏ మాత్రం పొంతన లేకుండా ఉన్నాయి. కబాలి నిర్మాత తప్పుడు లెక్కలు చెబుతున్నాడంటూ కొంత మంది కామెంట్ కూడ చేస్తున్నారు. ఇదిలా కబాలి మొదటి రోజు కలెక్షన్స్ 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందనే కోలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం,

ఇక రెండో రోజు కూడ కబాలి అదే విధంగా దూకుడు కలెక్షన్స్ ని చూపిచిందని అంటున్నారు. ఇక రెండో రోజు అటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోని ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ని చూస్తే దాదపు 93 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు. దీంతో కబాలికి రెండో రోజుల బాక్సాపీస్ లెక్కలను చూస్తే దాదాపు 193 కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ వచ్చాయనేది కోలీవుడ్ ట్రేడ్ పండిట్స్ లెక్క.

అయితే ఆదివారం వచ్చే కలెక్షన్స్ మొదటి రోజు కంటే ఎక్కువుగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా కబాలి మూడు రోజులు కలెక్షన్స్ ని ఊహిస్తే ఇది 300 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయటం జరుగుతుందని అంటున్నారు. తమిళంలో రియలిస్టిక్ సినిమాల దర్శకుడిగా పేరున్న పా రంజిత్, ఈ సినిమా తెరకెక్కించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: