ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల హడావిడి ఎక్కువుగా ఉంది. ఒక స్టార్ హీరో సినిమాలో హీరో,హీరోయిన్స్ ఎంత ముఖ్యమో...వారికి సపోర్ట్ గా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకి ఇప్పుడు క్రేజ్ ఎక్కువుగా వచ్చింది. ముఖ్యంగా హీరోలు,హీరోయిన్స్ కి అత్తగానూ, అమ్మాగానూ పాత్రల వేసే ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకి మంచి డిమాండ్ ఉంది.


హీరోయిన్స్ అందానికి ఏ మాత్రం తగ్గకుండా వీరి పాత్రలని డిజైన్ చేస్తున్నారు దర్శకులు, నిర్మాతలు. ఆ విధంగా వెలుగులోకి వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టే నదియా. ఈ మధ్య కాలంలో నదియా అందాలు హీరోయిన్స్ కి ధీటుగా ఉంటున్నాయి. ఇక రెమ్యునరేషన్ విషయంలోనూ నదియా చాలా ప్లెక్సిబుల్ గా ఉంటుందనేది నిర్మాతల ఫీలింగ్.


అయతే ఈ మధ్య కాలంలో నదియా రెమ్యునరేషన్ ని పెంచటంతో కొంత మంది దర్శకులు, నిర్మాతలు నదియాని కాకుండా ఆ పాత్రలకి మరో ఆర్టిస్ట్ లను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఆ విధంగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు మురుగదాస్‌ల కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకి మొదట మహేష్ బాబుకి అమ్మగా నదియాని కన్ఫర్మ్ చేసుకున్నారు.


చివరి నిముషంలో ఏమైందో తెలియదు కానీ, తరువాత నదియా మహేష్ మూవీ నుండి తప్పుకుందని అంటున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి ‘బిచ్చగాడు’ ఫేం దీపా రామానుజన్ మహేష్‌కు తల్లిగా నటించనున్నారని తెలిసింది. దీపా రామానుజన్ ‘బిచ్చగాడు’ సినిమాలో హీరో తల్లిగా నటించి మంచి పాపులారిటిని పొందారు. ఇక ఈ సినిమా జూలై 29 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తంగా నదియా మహేష్ మూవీ నుండి ఎందుకు దూరం అయ్యిందో అనేది మిస్టరీగానే ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: