టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాలకి సంబంధించిన సక్సెస్ రేటు ఎక్కువుగానే ఉంటుంది. హిట్టవుతుంది అనుకున్న సినిమాలు యావరేజ్ గా సక్సెస్ ని సాధిస్తున్నాయి. డిజాస్టర్ అవుతున్న సినిమాలు బ్లాక్ బస్టర్ గా మారుతున్నాయి. అయితే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న సినమాలకి మంచి కాలం వచ్చిందనే చెప్పాలి.


చిన్న సినిమాలుగా వచ్చిన వాటిలో దాదాపు 70 శాతం సక్సెస్ లని చూస్తున్నాయి. దీంతో చిన్న సినిమా నిర్మాతలకి మంచి రోజులు అని చాలా మంది అంటున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన బిచ్ఛగాడు సినిమా 25 కోట్ల రూపాయల లాభాలన్ని చూడటంతో...చిన్న సినిమాలకి భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో చిన్న సినిమాల వద్ద నుండి థియోటర్స్ యజమానులు భారీగా మనీని డిమాండ్ చేస్తున్నారు.


ఎక్కువ థియోటర్స్ కావాలంటే లక్షల్లో వసూల్ చేస్తున్నారు. అలా ఇచ్చుకోలేని చిన్న నిర్మాతలకి, వారి సినిమాని పెద్ద నిర్మాతలు రిలీజ్ చేసుకోనివ్వటం లేదని అంటున్నారు. దీని కారణంగా చిన్న నిర్మాతలు అందరూ నష్టపోవాల్సి వస్తుంది. దీంతో ఫిల్మ్ నగర్ లో ఉన్న తెలుగు ఫిల్మ్ చాంబర్స్ వద్ద చిన్న నిర్మాతలంతా కలిసి ధర్నాకు దిగారు.


వీరిలో ఎక్కువ మంది దిల్ రాజు గురించే ఎక్కువుగా చర్ఛించుకుంటున్నారంట. దిల్ రాజు స్వయంగా చిన్న నిర్మాతల సినిమాలకి థియోటర్స్ ని ఇవ్వటం లేదనేది వీరి వాదన. అయితే వీరికి ఎటువంటి న్యాయం జరగుతుందనేది ఇండస్ట్రీలోనూ ఆసక్తి కరంగా మారింది. ప్రస్తుతం థియోటర్ రేట్లు 10000 కి మించి ఉన్నాయి. వాటి రేట్లు తగ్గించాలనేది వీరి ప్రధానమైన డిమాండ్ అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: