పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ ప్రస్తుతం నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్, డాలీ దర్శకత్వంలో వస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ కేవలం రెండు, మూవీలతోనూ ఫిల్మ్ కెరీర్ కి ఫుల్ స్టాప్ ని పెడతాను అని స్టేట్మెంట్ ని ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ కి అవకాశం ఉన్నంత కాలం సినిమాలలో నటించాలని స్వయంగా చిరంజీవి సర్ధి చెప్పటంతో, పవన్ కళ్యాణ్ సైతం కొంత డైలమాలో పడ్డాడు.

ఇక పవన్ కళ్యాణ్ నటించనున్న సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కావాల్సి ఉండగా కొన్నికారణాల అది ఆలస్యం అవుతూ వస్తుంది. తాజాగా దీనిపై పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయాన్ని తీసుకొని, మూవీ షూటింగ్ కి ముహుర్తంని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఎస్. జె. సూర్య నుండి ‘డాలి’ చేతుల్లోకి వచ్చిన ఈ ప్రాజెక్ట్ ప్రారాంభోత్సవ పూజ తరువాత తిరిగి షూటింగ్ కి నోచుకోలేదు.

తాజాగా ఈ మూవీలో హీరోయిన్స్ శృతి హాసన్ అని ఫిక్స్ కావటంతో, షూటింగ్ సైతం ఆగష్టు 6వ తేధీని ఫైనలైజ్ చేసుకుంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ మూవీ అనంతరం ఏ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. త్రివిక్రమ్ తో కోబలి మూవీ అండర్ ట్రాక్ లో ఉన్నప్పటికీ...దీని స్క్రిప్ట్ పై వర్క్ చేయాలని త్రివిక్రమ్ కి పవన్ చెప్పలేదు.

తాజాగా త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ కి సంబంధించిన చర్ఛలను ముందుకు తీసుకురాగా పవన్ కళ్యాణ్ అంత ఆసక్తి చూపించలేదంట. దీంతో పవన్ కళ్యాణ్ డాలీతో మూవీ అనంతంరం తన ఫిల్మ్ కెరీర్ కి ఫుల్ స్టాప్ చెప్పే పనిలో ఉన్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ డాలీ మూవీ అనంతరం తన పూర్తీ జీవితాన్ని రాజకీయాలతోనే గడపాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తను క్రీయాశీలకంగా పనిచేయనున్నారనేది ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: