తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసులుగా వచ్చిన వారిలో నాగబాబు మొదటి వారు. రాక్షసుడు,మరణ మృదంగం లాంటి చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించారు..తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.  ప్రస్తుతం వెండి తెరపై నటిస్తూనే బుల్లి తెరపై జబర్ధస్త్ కామెడీ షో కి జడ్జిగా వ్యవహరిస్తూ కొన్ని సిరియల్స్ లో నటిస్తున్నారు.  ఇక మెగా బ్రదర్ గా పిలవబడే నాగబాబు అన్నయ్య అంటే వల్లమాలిని అభిమానం..గౌరవం. ఆ మద్య తమ్ముడు పవన్ కళ్యాన్ తో కొన్ని విషయాల్లో విభేదించిన చిరంజీవికి అన్నయ్యకే ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. అంతే కాదు ఆ మద్య చిరంజీవి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అనే నినాదాలు ఇవ్వడంతో వారిపై విరుచుకు పడ్డారు.


మెగా  బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాన్


వాడు మాకు మీకు అభిమాని హీరో కావచ్చు..కానీ వాడు మాకు తమ్మడు..మాకు తెలియదా వాడిని పిలవాలని మీరు మాకు చెప్పాలా..? ప్రతిసారి ఇలాంటి కార్యక్రమాల్లో మేం రావడం స్పీచ్ ఇచ్చేముందు పవర్ స్టార్ అనడం..అసలు అన్నయ్య లేనిదే పవర్ స్టార్ మీకు ఎక్కడ నుంచి వచ్చారు...మీకు అంతగా కావాలంటే పవన్ ఆఫీస్ వద్దకు వెళ్లి పిలవండి..అంటూ మెగా ఫ్యాన్స్ పై విరుచుకు పడ్డారు.  తాజాగా మరోసారి   నాగబాబు మెగా ఫ్యాన్స్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.  


మెగా హీరోలు


సాధారణంగా ఫ్యాన్స్ కు ఎప్పుడూ   ఎప్పుడూ అండగా ఉండే నాగబాబు కు ఎందుకు కోపం వచ్చిందో తెలుసా..! ఈ మద్య కొంత మంది మెగా ఫ్యాన్స్ ఇతర హీరోల కంటే తమ హీరోకే సొసైటీలో ఎక్కువ క్రేజ్ రావాలని  మెగా హీరోల సినిమాలు వస్తే ఎక్కువగా హడావుడి చేస్తూ జేబులోంచి డబ్బులు ఖర్చు పెడుతున్నారట ! ఇంకా కొంతమంది తమ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ హంగామా చేస్తున్నారట  దీంతో చిర్రెత్తుకొచ్చిన నాగబాబు ఈ విషయంలో చాలా సీరియస్ అయ్యారట.

మెగాస్టార్ బ్రదర్స్ చిన్ననాటి చిత్రం


అసలు మీ సొంత డబ్బులు ఖర్చు చేసి ఇంత హడావుడి ఎందుకు చేస్తారు..! ఆ డబ్బు ఎన్ని కష్టాలు పడితే వస్తుంది.. అలాంటపుడు అభిమానంతో ఇలా ఖర్చు చేస్తే మీ తల్లిదండ్రుల దగ్గర మా పరువు పోతోందని ఇకపై అలా చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట . ఇక ఈ వార్నింగ్ ఎందుకంటే వచ్చే నెల ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఇలా మెగా ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చాడట నాగబాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: