ఐదు పదులు వయసు దాటిపోయిన సీనియర్ నరేష్ నేటి తరం యంగ్ హీరోలకు మోస్ట్ ఎదోరబుల్ డాడీగా పలు సినిమాలలో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ చాల విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. బాల నటుడుగా సినిమా రంగంలోకి ప్రవేసించి 45 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ శ్రీదేవితో తాను నడిపిన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టాడు. 

శ్రీదేవి తనకన్నా వయసులో 2 ఏళ్ళు పెద్ద అని చెపుతూ చిన్నప్పుడు శ్రీదేవి తమ ఇంటి పక్కన ఉన్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తామిద్దరం కలిసి ట్యూషన్ కు వెళ్ళే సమయంలో శ్రీదేవికి తాను ‘ఐ లవ్ యూ’ చెప్పిన విషయాన్ని బయట పెట్టాడు. అయితే ఆ మాటలకు శ్రీదేవి తన అమ్మను అడిగి చెపుతానని అనడంతో అదిరిపోయిం ఆ తరువాత శ్రీదేవి వైపు చూడటం కొన్ని సంవత్సరాలు మానేసానని ఆ నాటి చిలిపి సంఘటనను గుర్తుకు చేసుకున్నాడు నరేశ్.

అయితే శ్రీదేవి టాప్ హీరోయిన్ అయిన తరువాత ఒక సందర్భంలో ఆమె తనకు ఎదురు పాడినప్పుడు శ్రీదేవి తనను పలకరించడమే కాకుండా తాను ఐ లవ్ యూ చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసి తనకు షాక్ ఇచ్చింది అని అంటున్నాడు నరేష్. 1990 తరువాత టివీల హవా మొదలు అయ్యాక సినిమాలు చూడటం చాలామంది తగ్గించి వేసారని దీనితో కేవలం యూత్ ను టార్గెట్ చేస్తూ సినిమాలు తీసే పరిస్థుతులు ఏర్పడటం వల్ల ఏ సినిమా ఎవరికీ నచ్చుతుందో తెలియని అయోమయంలో ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ ఉంది అన్న విషయాన్ని బయట పెట్టాడు నరేష్. 

రెండు సినిమాలు వరసగా హిట్ అయితే తన ఇంటిచుట్టూ తిరిగిన దర్శక నిర్మాతలు ఒక్క సినిమా ఫెయిల్ అయితే కనీసం ఫోనుకు కూడ అందుబాటులో లేకుండా బయటకు వెళితే ‘నీకు సినిమాలు లెవా ? అంటూ జాలిగా చూసే చాలామంది వ్యక్తుల ప్రవర్తన తనకు ఇప్పటికీ అర్ధం కాని పరిస్థితి అంటూ టాలీవుడ్ పరిశ్రమ ప్రస్తుత పరిస్థితి పై పంచ్ లు విసురుతున్నాడు ఒకనాటి సీనియర్ హీరో..  



మరింత సమాచారం తెలుసుకోండి: