వృక్షో రక్షితి రక్షితః ఈ మాట అక్షరాలా తెలంగాణలో అమలు అవుతుందే చెప్పాలి. గత పది హేను రోజులు తెలంగాణ లో హరిత హారం పేరిట వేల చెట్లు నాటారు..నాటుతున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థుల నుంచి తెలంగాణ సీఎం వరకు పాల్గొన్నారు. ఇక సినీ సెలబ్రెటీలు చిరంజీవి, నాగార్జున, అమల, నవతరం నటులు అంతా పాల్గొని ప్రజలను ఉత్సాహ పరుస్తున్నారు.  పవిత్రమైన పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశం తో , తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం లో హీరో నాని మరియు "మజ్ను" చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం సేకరించిన వివిధ రకాల మొక్కలను చిత్ర బృందం ఈ రోజు నాటటం జరిగింది.
ఈ సందర్భం గా హీరో నాని మాట్లాడుతూ, " హరితహారం అనేది చాలా మంచి ఐడియా. పర్యావరణాన్ని కాపాడాలని అందరూ అంటారు కానీ ఎవ్వరు పెద్దగా ఏమీ చేయరు. అందుకు భిన్నం గా CM గారు అవేర్నెస్ పెంచే ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం నిజం గా చాలా మంచి విషయం. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఈ కార్యక్రమం లో ఉత్సాహం గా పాల్గొంటోంది.
ఎవరి ఇళ్లల్లో వాళ్ళు నాటటం కాకుండా, మా మజ్ను చిత్ర బృందం మొత్తం కలిసి ఈ కార్యక్రమం లో పాల్గొనాలని నిర్ణయించుకుని, ఇలా చేస్తున్నాం. ఎవరికి తోచిన విధం గా వారు, ఒక చిన్న చోటు ఉన్నా కూడా ఒక మొక్కను పెంచితే, ఖచ్చితం గా మంచి మార్పు ఉంటుంది అని అనుకుంటున్నాను", అని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: