సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ చిత్రాలు కామన్ గా వస్తుంటాయి.  కారణం ఆయా భాషల్లో హిట్ అయిన చిత్రాలు వేరే భాషల్లో రిమేక్ కి బదులు డబ్బింగ్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. కొన్ని సందర్బాల్లో డబ్బింగ్ చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలు ఉన్నాయి. అయితే సినిమాల వరకు అయితే ఓకే కానీ ఇప్పుడు ఈ ప్రభావం బుల్లి తెరపై పడటంతో ఇక్కడి ఆర్టిస్టులకు, టెక్నీషియన్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. తాజాగా  డబ్బింగ్ సీరియల్స్పై తెలుగు టెలివిజన్ యూనియన్ సీరియస్ అయింది. తెలుగు ఆర్టిస్టులకు, టెక్నీషియన్ల జీవితాలను రోడ్డున పడేసేలా డబ్బింగ్ సీరియల్స్ దండయాత్ర చేస్తున్నాయని తెలుగు టెలివిజన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది.

డబ్బింగ్ సీరియల్స్ అడ్డుకుని తీరుతామని మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యామని తెలుగు టెలివిజన్ ఆసోషియేషన్ ప్రకటించింది.  ఈ మేరకు ఫిలించాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుల్లితెర ఆర్టిస్టుల డైరెక్టరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్టిస్టుల డైరెక్టరీ ఆవిష్కరించారు. టెలివిజన్ యూనియన్ సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.  

ఈ సందర్భంగా నిర్మాత, సుఖీభవ వెంచర్ అధినేత గురురాజ్ను, టీవీ ఫెడరేషన్ చైర్మెన్ మేచినేని శ్రీనివాసరావును సన్మానించారు. తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు అధ్యక్షుడు వినోద్బాల, తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు అసోషియేషన్ సెక్రటరీ విజయ్ యాదవ్, నటుడు శివాజీ రాజా, హరి, రామ్జగన్, నాగమణి, సుబ్బారావు.. టీవీ ఆర్టిస్టులు పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: