భగవంతుడి అనుగ్రహం కోసం భక్తులు దీక్షలు పట్టడం చాల చోట్ల కనిపిస్తూ ఉంటుంది. అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, సాయి దీక్ష, శివ దీక్ష ఇలా ఎన్నోరకాల మాలలు దీక్షలు ఆధ్యాత్మికతను మిళితం చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా కనిపిస్తున్నాయి. చిరంజీవినే కాకుండా మెగా కుటుంబాన్ని విపరీతంగా అభిమానించే మెగా అభిమానులు కొంతమంది చిరంజీవి 150వ సినిమా విజయంకోసం చిరంజీవికి అత్యంత ఇష్టమైన అంజనేయ స్వామిని ఆరాధిస్తూ అంజానేయ మాల వేసుకోబోతూ ఉండటం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఆగష్టులో రాబోతున్న మెగా స్టార్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి విజయాన్ని కోరుకుంటూ ఈమాలను వేసుకుని 9 రోజులపాటు దీక్ష చేయడానికి మెగా అభిమానులలోని కొందరు ఇప్పటికే ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా చిరంజీవి ౬౧వ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అనే ఒక బ్రోచర్ ని కూడ మెగా అభిమానులు రూపొందించి మన ఇరు రాష్ట్రాలలోని చిరంజీవి అభిమాన సంఘాలకు సర్కలేట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి పట్ల మెగా అభిమానులకు విపరీతమైన అభిమానం ఉంది అన్న విషయం వాస్తవమే అయినా ఒక హీరో అభిమానులు తమ హీరో విజయం కోసం దీక్షా మాలలు వేయడం ఇదే ప్రప్రధమం అని అంటున్నారు. ఈ విషయంలో కూడ మెగా స్టార్ తన అభిమానుల ద్వారా ఒక కొత్త రికార్డు సాధించాడనుకోవాలి.

ఈసారి పుట్టినరోజు వేడుకలను ఎలా నిర్వహించాలి అన్న విషయమై ఇప్పటికే మెగా కాంపౌండ్ నుండి స్పష్టమైన సందేశాలు అందుకున్న మెగా అభిమానులు భారీ ఖర్చుతో భారీ కార్యక్రమాలు చేయకుండా చిన్నచిన్న కార్యక్రమాలు మన ఇరు రాష్ట్రాలలోని ప్రతి నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. చిరంజీవి 150వ సినిమా విడుదల సమయానికి ఇప్పటి వరకు వర్గాలుగా విడిపోయిన మెగా అభిమానులను ఒక్క త్రాటి పైకి తీసుకురావడానికి చిరంజీవి సలహాలతో చరణ్ చాలా వ్యూహాత్మకంగా ఇప్పటికే అడుగులు వేస్తున్నారు అని ఫిలింనగర్ టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: