సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కబాలి. ప్రస్తుతం ఈ మూవీ థియోటర్స్ లో హల్ చల్ చేస్తుంది. మరోవైపు కలెక్షన్స్ ని సైతం రికార్డ్స్ ని బ్రేక్ చేసేలా కలెక్ట్ చేస్తుంది. ఇక రజనీకాంత్ నటించిన ఈ మూవీని, బాలీవుడ్ లో రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ సుల్తాన్ మూవీతో పోల్చుతున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తూన్ మూవీ ఈద్ పండుగ సందర్భంగా రిలీజ్ అయింది.

ఇప్పటి వరకూ ఈ మూవీ 500 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఆ తరువాత వచ్చిన  సౌత్ ఇండియన్ మూవీ, అంతకు మించిన కలెక్షన్స్ ని కొల్లగొడుతుందని ఇండియన్ ట్రేడ్స్ లో ఉన్న టాక్స్. ఆ విధంగానే రజనీకాంత్ మూవీ కబాలిపై హైప్ క్రియేట్ అవుతూ వస్తుంది. ఇక కబాలి మూవీ థియోటర్స్ ని హిట్ చేసిన అనంతరం ట్రేడ్ వర్గాలు ఈ మూవీ కలెక్షన్స్ ని లెక్కపెట్టే పనిలో ఉన్నారు.

అయితే కబాలి మూవీ మొదటి రెండు రోజుల కలెక్షన్స్ పై కొంత గంధరగోళం చెలరేగినప్పటికీ...ఈ మూడు రోజుల కలెక్షన్స్ విషయంలో మాత్రం ఓ క్లారీటీ వచ్చింది. మొదటి మూడు రోజుల కబాలి కలెక్షన్స్ ని చూస్తే, ఈ మూవీ 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టిందని అంటున్నారు. ట్రేడ్ పండిట్స్ సైతం కబాలి మూవీ మంచి కలెక్షన్స్ ని సాధించిందని అంటున్నారు.

అయితే ఈ మూవీ 500 కోట్ల రూపాయల మార్క్ ని టచ్ చేస్తుందా? లేదా? అనేది కొంచెం అనుమానమే అని అంటున్నారు. ఇక ట్రేడ్ వర్గాలు తేల్చిన కలెక్షన్స్ లెక్కలపై కబాలి నిర్మాత మాత్రం ఏకీభవించటం లేదు. కబాలి మూవీ మొదటి రోజే 250 కోట్ల రూపాయలను దాటిందని, తన దగ్గర ఆ వివరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కానీ బాలీవుడ్ ట్రేడ్ పండింట్స్ మాత్రం వారి దగ్గర ఉన్న మూవీ రిలీజ్ థియోటర్స్ లెక్కల ప్రకారం, ఈ మూవీ మొదటి 3 రోజులు 200 కోట్ల రూపాయలనే కొల్లగొట్టిందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: