ఓ పక్క సినిమాల్లో నటిస్తూ రొమాన్స్ చేస్తున్నా వారిద్దరు బయట కూడా నిమిషం టైం వేస్ట్ చేయకుండా ఎక్కడ కనిపించినా సరే ఎంతమంది ముందైనా సరే హగ్గులు, కిస్సులు పెట్టుకోవాల్సిందే. ఇలా వీరు ముద్దులు పెట్టుకోవడం కామనే అయినా రీసెంట్ గా ఓ పబ్లిక్ మీట్లో ఇద్దరు శృతిమించి కనిపించారు. ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే వివరాలు ఇలా ఉన్నాయి. 


బాలీవుడ్ హాట్ కపుల్ అంటే టక్కున గుర్తొచ్చేది రణ్ వీర్, దీపికా పదుకునేలే.. ఆన్ స్క్రీన్ రొమాన్స్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా అదరగొట్టేస్తున్న ఈ జంట ఈ మధ్య మదారి స్క్రీనింగ్ లో మరింత రెచ్చిపోవడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. ఇమ్రాన్ ఖాన్ మదారి స్క్రీనింగ్ లో బీ టౌన్ సెలబ్రిటీస్ అంతా పాల్గొన్నారు.


అయితే నిండా ప్రేమలో మునిగితేలుతున్న రణ్ వీర్ దీపికాలకు మాత్రం ఎవరు కనిపించలేదు అందుకే ఇద్దరు అలా కనబడ్డారో లేదో ఇలా హగ్గులిచ్చుకుని అందరిని ఆశ్చర్య పరిచారు. మరి అందరి ముందే ఇలా రెచ్చిపోతున్న ఈ జంట ఎవరు లేకుండా కలిస్తే ఏంటో అని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు ప్రమోట్ అయిన దీపికా తన బోయ్ ఫ్రెండ్ ను మాత్రం  మరచిపోలేదు.


ఇక వీరిద్దరు ఇలా రెచ్చిపోడానికి కారణం ఇద్దరికి ఎంగేజ్ మెంట్ కూడా అయ్యిందని కొందరి టాక్. మరి ఏది ఏమైనా పబ్లిక్ గానే ఇలా రొమాన్స్ కు దిగిన ఈ జంట కాస్త ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నాం అన్న విషయాలను గమనిస్తే మంచిందని అభిప్రాయపడుతున్నారు కొందరు. మరి ఇంత రెచ్చిపోతున్న ఈ జంట ఇంతకీ పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది అందరు ప్రశ్న.  



మరింత సమాచారం తెలుసుకోండి: