టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్ బోయపాటి పై యంగ్ హీరో అసంతృప్తి గా ఉన్నాడంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, హీరోలకి మాస్ గుర్తింపు రావాలంటే కచ్ఛితంగా ఒక్కసారైనా ఆ హీరోలు బోయపాటి శ్రీను దర్శకత్వంలో పని చేయాలని అనుకుంటారు. ఆ విధంగానే స్టార్ హీరో అల్లుఅర్జున్ సైతం బోయాపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు మూవీలో నటించాడు.


ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి సక్సెస్ ని సాధించింది. ఇక ఈ మూవీ అనంతరం బోయాపాటి శ్రీను డైరెక్ట్ చేయనున్న మూవీ ప్రస్తుతం సెట్స్ మీదకు వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఈ మూవీ రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ మూవీకి 'పుష్పక విమానం'అనే టైటిల్‌ ని బోయపాటి ఫిక్స్ చేశాడని అంటున్నారు.


అయితే మాస్ హీరోగా ఇంకా గుర్తింపుని కోరుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి, డైరెక్టర్ పెట్టిన పుష్పక విమానం టైటిల్ అస్సలు నచ్ఛలేదంట. దీంతో తను ఏదైతే అనుకున్నాడో, దాన్ని డైరెక్టర్ కి ఫేస్ టు ఫేస్ చెప్పాడని అంటున్నారు. దీంతో డైరెక్టర్ కొంత ఇరుకున పడ్డట్టే అని అంటున్నారు. ఇప్పుడు ఆ పుష్పకవిమానం టైటిల్ ని మార్చాలా? వద్దా? అనేది కొద్దిగా  డైలమాలో ఉన్నాడు.


ఇక హీరో సంగతి పక్కన పెడితే, హీరో తండ్రి అయిన బెల్లంకొండ సురేష్‌ పుష్పక విమానం టైటిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ట్విస్ట్ గా మారింది. ప్రి ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇక హీరోయిన్ విషయంలోనూ టాప్ హీరోయిన్స్ ని ఇందులోకి తీసుకోవాలనేది డైరెక్టర్ నిర్ణయంగా తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: