జబర్దస్థ్ తో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్న హాట్ బ్యూటీ రష్మి అదే పాపులారిటీతో మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు కూడా సినిమాలు చేసినా కేవలం చిన్న చితకా పాత్రల్లో కనిపించిన రష్మి ఇప్పుడు తన అందాలతో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ ఇయర్ గుంటూర్ టాకీస్ అంటూ వచ్చి రష్మి చేసిన రచ్చ అందరికి తెలిసిందే. అయితే ఆ వేడి చల్లారింది అనుకుంటే రీసెంట్ గా అంతంతో మళ్లీ ఆడియెన్స్ లో హీటు పెంచేసింది ఈ అమ్మడు.


అంతంలో కేవలం ఓ పాటలోనే రెచ్చిపోయిన రష్మి ఎలాగైనా క్రేజ్ సంపాదించాలనే నెపంతో అడ్డు అదుపులేని అందాల ప్రదర్శనతో కట్టి పడేస్తుంది. ఇక సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా రష్మి అందాలతో ఆ సినిమాలు బిజినెస్ బాగానే చేస్తున్నాయి. అయితే అంతం అలా వెళ్తుందో లేదో మరో కొత్త ట్రైలర్ తో వచ్చేసింది రష్మి. తను వచ్చనంట ట్రైలర్ తో హడావిడి చేస్తున్న రష్మి ఈ సినిమాలో కొద్దిగా హర్రర్ జానర్ లో వెళ్లినట్టు కనిపిస్తుంది.  


సినిమాలో విషయం ఉన్నా లేకున్నా రష్మి హాట్ స్టిల్స్, ఓ రొమాంటిక్ సాంగ్స్ తో థియేటర్స్ కు ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి రష్మి తను వచ్చెనంట ట్రైలర్ చూస్తే ఏంటో రష్మి గోల అనిపించక మారదు. జోమీ ప్లస్ కామెడీ కలిపి జోమెడీ అంటూ హడావిడి చేస్తున్న రష్మి ఓ నవ్వించే దెయ్యంగా అందరిని ఆకట్టుకుంటుందట.  


ప్రతిసారి అందంతో ఆకట్టుకోవడం అంటే కుదరని పని.. మరి రష్మి కేవలం ఇలా స్కిన్ తో ఎట్రాక్ట్ చేసే పద్ధతి మానుకుని అభినయం ఉన్న పాత్రల్లో నటించి మెప్పిస్తే మంచిదని అంటున్నారు. ఓ పక్క బుల్లితెర మీద షోలు చేస్తూనే మరోపక్క సిల్వర్ స్క్రీన్ పై రష్మి చేస్తున్న ఈ రచ్చ చూస్తుంటే అమ్మడు స్టార్ తిరిగినట్టు అనిపిస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: