ఈమధ్య కాలంలో నాగ చైతన్యతో ప్రేమ వ్యహారాలలో బిజీగా ఉన్న సమంత కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ విడాకులకు పరోక్షoగా కారణం అంటూ కోలీవుడ్  మీడియా రాస్తున్న గాసిప్పులు హాట్ న్యూస్ గా  మారాయి.  ఈ విడాకుల వ్యవహారంలో సమంత ప్రమేయానికి సంబంధించిన  కారణాలు చదివిన వారికి మాత్రం మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం.

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళ్ళితే  తన పెళ్ళి డేట్ దగ్గర పడుతున్న నేపధ్యంలో సమంత కొన్నిరోజుల క్రితం తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ చిత్రం ‘వడ చెన్నై’ నుంచి  వాకవుట్‌ చేసిన విషయం తెలిసిందే చేసింది. కేవలం నాగచైతన్యతో పెళ్లి కోసమే సమంత  ఈసినిమాను వదులుకున్న విషయం ఓపెన్ సీక్రెట్ ఈ సినిమాలో సమంత స్థానంలో అమలాపాల్‌ ను తీసుకున్నాడు ధనుష్‌. 

ఈ సూచన కూడా సమంత చేసినట్టు కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. పెళ్ళి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలనే షరతు మీద అమలను వివాహం చేసుకున్న విజయ్‌ కు ఆమె వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లడం ఏ మాత్రం ఇష్టం లేదు అని కోలీవుడ్ మీడియా కథనం. సమంత సూచనతో ‘వడ చెన్నై’ సినిమాలో అమలాపాల్ ను ఎంపిక చేసిన తరువాత విజయ్ అమల  లమధ్య భేదాభిప్రాయాలు తీవ్రస్థాయికి చేరిపోవడంతో వారిద్దరూ విడిపోవడమే మంచిది అనే అభిప్రాయానికి వచ్చినట్లు టాక్. 

దీనికితోడు లేటెస్ట్ గా ఢిల్లీకి చెందిన ఒక పంజాబీ డిజైనర్ తో అమలాపాల్ సన్నిహితంగా ఉంటోంది అన్న వార్తలను కూడ కోలీవుడ్ మీడియా వ్రాస్తోంది. మాయలేడిగా పేరున్న సమంత తాను ధనుష్ సినిమా నుండి తప్పుకోవడానికి వ్యూహాత్మకంగా అమలాపాల్ ఉపయోగించుకుని ఆ మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నా సమంత వ్యూహాత్మక ఎత్తుగడల వల్ల పరోక్షంగా విజయ్ అమలాపాల్ లమధ్య చిచ్చు రేగడం ఒక విధంగా ఆశ్చర్య పరిచే న్యూస్ అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: