తెలుగు ఇండస్ట్రీలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆలీ ఇప్పటి వరకు ఎన్నో వైవిద్యమైన పాత్రలు వేశారు.  కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్నపుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘యమలీల’ చిత్ర ద్వారా హీరోగా మంచి నటన కనబరిచాడు తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ కమెడియన్ గానే కొనసాగుతున్నారు.  గత కొంత కాలంగా వెండి తెరపైనే కాకుండా ఆలీ బుల్లి తెరపై కూడా తనసత్తా చాటుతున్నారు. అంతే కాదు అవార్డు , ఆడియే వేడుకల్లో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఆలీ ఆడవారి పట్ల అసభ్యంగామాట్లాడుతున్నారని వార్తలు వచ్చాయి. అంతే కాదు ఆ మద్య ఓ యాంకర్, మరో యంగ్ హీరో ఆలీకి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారట. అంతే కాదు ఈ మద్య ఓ ఫంక్షన్లో సీనియర్ నటి సుహాసిని కూడా ఆలీకి క్లాస్ పీకిందట. ఏది ఏమైనా సహ యాంకర్లు, నటీ నటులపై సెటైర్లు వేయడం ఆలీకి ఆలవాటైంది.

మొదట కామెంట్ చేయడం తర్వాత దాన్ని సర్ధి చెప్పడంలో ఆలీకి మించిన వారు లేరు. తాజాగా హాట్ యాంకర్ అనసూయను ఆలీ తిట్టడమే కాకుండా నీకు యాక్టింగ్  రాదు పో అంటూ చెంప పై కొట్టబోయాడట దీంతో ఎంతో అవమానంగా ఫీల అయ్యింది అనసూయ. అంతే కాదు పక్కన ఉన్న మరో కమెడియన్ రఘు కి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చాడట ఆలీ దీంతో ఆయన కూడా చాలా అవమానంగా ఫీల్ అయ్యాడట.  ఆ... అయితే ఇదంతా నిజంగా జరిగింది కాదండీ బాబూ కేవలం నటన మాత్రమే..''సినిమా అవార్డ్స్ '' కోసం అనసూయ , ఆలీ , రఘు చేసిన సాగర సంగమం చిత్రానికి స్పూఫ్ మాత్రమే సుమా ! అయితే  ఈ సందర్భంగా అనసూయ మహానటి అన్నట్లుగా బిల్డప్ ఇస్తారు దాని కోసం ప్రెస్ మీట్ కూడా పెడతారు .

అయితే అందరూ అనసూయని పొగుడుతూ రాస్తే (సాగర సంగమంలో  కమల్ హాసన్ ని పోలిన పాత్రలో ) ఆలీ (బాలు ) మాత్రం అనసూయని పరమ చెత్త నటి అంటూ పేపర్ లో రాస్తాడు . అంతేకాదు కొట్టబోతాడు కూడా..ఇదండీ అసలు విషయం అయితే ఈ షో చూసిన వారు మాత్రం కడుపుబ్బా నవ్వుకున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: