ఓ పక్క కబాలి పోయిందంటూ ప్రచారం జరుగుతుంటే మరో పక్క తన రికార్డు క్రియేట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు రజిని. రజిని ఖలేజా ముందు మహేష్ స్టామినా ఎంత అన్నది లెక్క కట్టలేం కాని.. సూపర్ స్టార్స్ ఇద్దరు తమ తమ సినిమాలతో ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సంపాదిస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కబాలి సినిమాతో రజిని మహేష్ ను కొట్టేశాడని కలక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. 


ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అయిన కబాలి మొదటి రోజు నుండి డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలక్షన్స్ మాత్రం కుమ్మేస్తుంది. సినిమాను ముందే చూసేయాలని అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న వారంతా సినిమా చూడగా ఈ మూడు రోజుల్లోనే రజినికాంత్ మహేష్ ఆల్ టైం హిట్ శ్రీమంతుడు రికార్డును బద్ధలు కొట్టేశాడు.


సౌత్ లో ఓవర్సీస్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న మహేష్ రజినికాంత్ లు తమ సినిమాలతో అక్కడ విజయ ఢంఖా మోగించడమే కాకుండా రికార్డు కలక్షన్స్ రాబట్టుకుంటున్నారు. అయితే శ్రీమంతుడు టోటల్ రన్ టైంలో మొత్తం ఓవర్సీస్ లో 2.9 మిలియన్ డాలర్స్ కాగా కేవలం కబాలి మూడు రోజుల్లో 4 మిలియన్ల రూపాయలను కలక్షన్స్ రూపల్లో వసూళు చేశాడు.


సో ఈ లెక్కన చూస్తే రజిని కేవలం యావరేజ్ మూవీతోనే ఇలాంటి సంచనలాను సృష్టించ గలిగాడంటే ఒకవేళ ఫ్యాన్స్ అంచనాలను మించి లేదా చేరువలో ఈ సినిమా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎవరు బీట్ చేయలేని రికార్డుని తన సొంతం చేసుకునే వాడని చెప్పొచ్చు. ప్రస్తుతం కబాలి రిజల్ట్ తో ఫ్యాన్స్ ఎలా ఉన్నా ముందు రెండు ఫ్లాపుల కన్నా ఈ సినిమా కాస్త బెటర్ అని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: