మెగా స్టార్ చిరంజీవికి మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మన తెలుగు వారు ఎక్కువగా ఉండే అమెరికాలో కూడ లక్షల సంఖ్యలో చిరంజీవికి వీరాభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అయితే చిరంజీవి సినిమాలు ఇప్పటి వరకు కనీసం విడుదల కాని స్పెయిన్ దేశంలో మెగా స్టార్ కు ఉన్న క్రేజ్ చూసి వరుణ్ తేజ్ షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ తన ట్విటర్ లో ఫోటోలతో సహా మెగా అభిమానులకు షేర్ చేసాడు. ఆ శక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పెయిన్ దేశంలో తన ‘మిష్టర్’  సినిమా షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్ళినప్పుడు అక్కడ మెగా స్టార్ కు ఉన్న క్రేజ్ చూసి షాక్ అయ్యాడట. వరుణ్ తేజ్ రోజూ హోటల్ నుండి షూటింగ్ స్పాటుకు వెళ్ళడానికి ఒక కారు వాడుతున్నాడట. 

ఆ కారులో ప్లే అయ్యే ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ పేరు ‘మెగా స్టార్’ మెగాస్టార్ FM గా  స్పెయిన్లో ఈ రేడియో బాగా పాపులర్ అని వరుణ్ తేజ్ చెపుతున్నాడు. అయితే ఆ రేడియో మెగా స్టార్ అన్న పేరు ఎందుకు పెట్టుకుందో తనకు తెలియకపోయినా అక్కడ కూడ మెగా స్టార్ అనే పదం పాపులర్ కావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని అంటున్నాడు ఈ యంగ్ మెగా యంగ్ హీరో. 

దీనితో తాను స్పెయిన్ లో షూటింగ్ లో ఉన్నంత కాలం ఈ యఫ్. ఎమ్. రేడియో స్టేషన్ లో పాటలు కాకుండా మరే రేడియో స్టేషన్ పాటలను తాను వినడం లేదు అంటూ ట్విట్ చేసాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ జపాన్ మలేషియా సింగపూర్ లాంటి దేశాలలో విపరీతమైన పాపులర్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇండియాకు చాల దూరంలో ఉన్న స్పెయిన్ లో మెగా స్టార్ పేరుతో హంగామా జరుగుతూ ఉండటం ఒక విధంగా మెగా ఫ్యామిలీకే కాదు మెగా అభిమానులకు కూడ జోష్ ఇచ్చే న్యూస్..


మరింత సమాచారం తెలుసుకోండి: