దర్శకుడు మారుతికి ఎప్పటి నుంచో టాప్ హీరోల సినిమాలకు దర్శకుడిగా మారాలని కోరిక. మెగా కాంపౌండ్ తో మారుతికి ఉన్న పరిచయాల రీత్యా అల్లుఅర్జున్ రామ్ చరణ్ లతో సినిమాలు చేయాలని ఎంతో ప్రయత్నించినా చివరకు అల్లు శిరీష్ తోనే సరిపెట్టుకున్నాడు మారుతి. అయితే గత ఏడాది విడుదల అయిన ‘భలే భలే మగాడివోయ్’ సూపర్ సక్సెస్స్ తో వెంకటేష్ తో సినిమా తీసే జాక్ పాట్ కొట్టేసాడు మారుతి. 

మొన్న విడుదల అయిన ఈ సినిమా పాటలకు టీజర్ కు మంచి క్రీజ్ ఏర్పడటంతో జోష్ లో ఉన్న మారుతికి  త్రివిక్రమ్ సలహాలు తల నొప్పిగా మారాయని టాక్. దీనికి కారణం  ‘బాబు బంగారం’ సినిమా పై త్రివిక్రమ్  చేసిన సూచనలు అని అంటున్నారు. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘బాబు బంగారం’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘అ ఆ’ సినిమా నిర్మాత రాధకృష్ణ తనకు త్రివిక్రమ్ తో ఉన్న సానిహిత్యం రీత్యా త్రివిక్రమ్ కు ప్రత్యేకంగా ఈ సినిమా చూపించాడు అని టాక్. 

ఈ సినిమాను చూసిన త్రివిక్రమ్ ఊరుకోకుండా కొన్ని సజెషన్లు కూడ చేసాడని టాక్. ఇప్పుడు ఈ సలహాలు మారుతికి తల నొప్పిగా మారాయి అనే గాసిప్పులు వస్తున్నాయి. సాధారణంగా ఒక దర్శకుడు తీసిన సినిమాను మరొక దర్శకుడు ఆ సినిమా విడుదలకు ముందు చూసినా ఏ విధమైన రిమార్కులు చేయరు అని అంటారు. 

అయితే త్రివిక్రమ్ ‘బాబు బంగారం’ చూసి ఊరుకోకుండా కొన్ని సజెషన్లు రిమార్కులు చేసి వెళ్ళి పోవడంతో అవి ఇప్పుడు మారుతి పీకకు చుట్టుకుని అవి అమలు చేయాలా లేదా అన్న సందిగ్ధంలో మునిగిపోయినట్లు టాక్. దీనితో త్రివిక్రమ్ స్టైల్ మారుతికి ఎలా వస్తుంది అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.  అంతేకాదు ఎస్టాబ్లిష్డ్  డైరక్టర్ సినిమాను మరోటాప్ డైరక్టర్ కు చూపించి సలహాలు అడగడం అనేది ఎంతవరకు సమంజసం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: