జనతా గ్యారేజ్’ అనుకున్న తేదీకి విడుదల కానందుకు టెన్షన్ పడుతున్న జూనియర్ కు ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి మోహన్ లాల్ కొరటాల శివలకు మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు తల నొప్పిగా మారినట్లు వార్తలు వస్తున్నన్నాయి. మోహన్ లాల్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటిస్తున్న  ‘మనమంతా’ సినిమాకు తాను స్వయంగా తెలుగులో డబ్బింగ్  చెప్పాడు. 

ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి మోహన్ లాల్ చాలా కష్టపడి తెలుగు నేర్చుకున్న విషయం తెలిసిందే. అయితే మొహన్ లాల్ తెలుగు డైలాగ్స్ పలకడంలోని స్పష్టత సరిగ్గా లేక పోవడంతో కొరటాల ‘జనతా గ్యారేజ్’ కి సంబంధించి మోహన్ లాల్ సొంత గొంతుతో కాకుండా వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ తో ‘జనతా గ్యారేజ్’ కి డబ్బింగ్ చెప్పించాలి అని అనుకున్నాడట. 

అయితే మోహన్ లాల్ మాత్రం తన పాత్రకు తనే డబ్బింగ్ చెపుతానని అవసరం అనుకుంటే ఎక్కువ టేక్స్ తీసుకోమని మోహన్ లాల్ పట్టుపట్టి చెపుతూ ఉండటంతో ఈ సున్నిత విషయాన్ని మోహన్ లాల్ కు వివరించి  కొరటాల ఎలా పరిష్కరిస్తాడో అని జూనియర్ టెన్షన్ పడుతున్నట్లు టాక్. ఈవార్తలు ఇలా ఉండగా ‘జనతా గ్యారేజ్’ కి సంబంధించిన చివరి షెడ్యూల్ ఆగష్టు 1నుండి 10వ తారీఖు వరకు జరగబోతోంది.

ఈసినిమా ఆడియో ఫంక్షన్ ను ఆగష్టు 13న భాగ్యనగరంలో అత్యంత ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ లో దేవిశ్రీ ప్రసాద్ చేయబోయే లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ కార్యక్రమానికి హైలెట్ గా మారుతుంది అని అంటున్నారు. వినాయక చవితిని టార్గెట్ చేస్తూ విడుదల ఆతున్న ఈసినిమా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న విడుదల కావడం ఈ సినిమాకు సంబంధించి మరొక ఆశ్చర్యకరమైన ట్విస్ట్..


మరింత సమాచారం తెలుసుకోండి: